పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/88

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

సకలాధీశనతోత్తమాంగ్గమణిభూషారమ్యపాదాంబుజుం[1] దా
టక నారాయణు భానువంశన్రిపచూడారత్ను సిష్టేష్టబం[2]
ద్ధుకవీంద్రద్విజరక్షుం గాస్యప[3]సుగోత్రుం బాటక[4]వ్వ్రాతపు
త్రకు మాయోపిలిసిద్ధిం జెప్పందగు నుద్యద్గండ్డగోపాలునిని.

22


చ.

త(న)నిజవ్రిత్తి మింద[5] విదితంబుగ నోపిలిసిద్ధి విన్నసి
ద్ధనకు నన్గుందమ్ముండు[6] ప్రతాపమునం జని కమ్మనాండు సే
కొని గణపతీశు[7]దయం గూడి తదాజ్ఞ వహించ్చి యేలెం బా
వనమగు నాఱువేలును నవక్రపరాక్రమవిక్రమంబునను.

23


వ.

ఇ ట్లేలి సప్తసంతానంబులు దేవబ్రాహ్మణదత్తులు సమస్తధర్మ్మం
బులుం బ్రతిపాలించ్చి॥ స్వస్తి చరణసరోరుహవిహితవిలోచన
త్రిలోచనప్రము ఖాఖిలప్రిథ్వీశ్వర కారితకావేరీతీర కరికాలకుల
రత్నప్రదీపాహితకుమారగజాంకుశ యొఱయూరిపురవరాధీశ్వర
సూర్య్యవంశోద్భవ కాస్యపగోత్ర[8] తేంక్గణాదిత్య జగదొబ్బ
గండ్డ కీర్త్తినారాయణ సమస్తప్రశస్తి సహితంబు శ్రీమనుమహా
మండలేశ్వర యోపిలి సిద్ధనదేవచోడమహారాజులు స్వస్తి శ్రీశక
వర్షంబులు 1146 గు తారణసంవత్సర కార్త్తికశుద్ధ శ్రీ
యేకాదసిశుక్రవారమునం గమ్మనాంటిలోన నిజరాజధానియైన
కొట్టియదొన శ్రీశంకరేశ్వరశ్రీమహాదేవరకు గణపతిదేవమహా
రాజునకు ధర్మ్ము(వు)గా హవిర్బలి యర్చ్చనలకు[9] నంగ
భోగరంగభోగాలకు నందుల మొగడచెఱువు దేవభోగ మాచం

  1. పాదాబ్జు
  2. శిష్టేష్ట
  3. గాశ్యప
  4. బాఠక
  5. మింద = మీఁద
  6. ననుంగుందమ్ముండు
  7. గణపావనీశు
  8. కాశ్యపగోత్ర
  9. హవిర్బల్యర్చ్చనలకు