పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/81

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దారాకల్పవధూ...... గువిద్ధాసానికిం బుత్రకుం
డారంగా ... ... ట్టె బుధు లత్యంత్తంబు వర్న్నింపంగాన్.

1


చ.

గుణ(నిధి స)జ్జనప్రభుండు గొంటెనపెద్దికి సత్పతివ్రతా
(మణియ)గు మాంకమాంబికకు మానుషపౌరుషగౌరవద్వి(జా
గ్రణి) నిజభక్తితోషితవిరాజచంద్రధరుండు సత్య(భా
ష)ణుం డుదయించ్చె నూర్జితలసన్మతి యప్పనపెద్ది యిద్ధ(రన్).

2


శా.

ప్రస్తుత్యంబుగ నిట్లు దా నుదయమఇ[1]భాస్వర్దశా ...౦డై
స్వస్తిశ్రీవిభుం గేతభూవిభు నిజస్వామిని సదాసు... ...
తస్తోత్రశ్రవణియ్యుం[2] జేయుచును మిత్రశ్రేణి రక్షించుచో
న(స్తోకు)౦డై యప్పదేవండు సముద్యత్కీర్త్తిన్ పర్వ్వె న్మహిని.

3


క.

విద్వత్సభం (జె)ప్పందగును
సద్విజు రాయూరిపూర్వ్వశాసను శ్రీభా
రద్వా(జ)గోత్రు శివుచర
ణద్వయపూజితుని నప్పనం బ్రథిత(య)శున్.

4


చ.

అమలశకాబ్దములు గరసహస్రకరక్షితిసంఖ్య (గా)౦గం బౌ
ష్యము సితపక్షశైవతిథి నారుదినంబున నుత్తరాయనం
బమరిన సంక్రమాణమున నప్పన పెట్టె నఖండదీప ము
త్తముం డమరేశుమ్రోల శశితారక మొప్పి వెలుంగుచుండంగాన్.

5

—————

  1. మై
  2. శ్రవణీయుం