పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/63

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

మానితసచ్చరిత్ర (కు)పమాన మమానుషమానవంబు సం
త్తాన కతుల్య మర్త్థిజనతాప్రణుతాభిమతార్త్థ మీగి మెయి[1]
మానవనాథమాన్యతకు మన్యుపమంత్త్రి సమాను ణ్డంచ్చు
క్ష్మీనిధి నెల్లనిని విబుధమిత్రు నుతింత్తురు సత్కవీశ్వరులు.

9


ఉ.

మన్యుపవైభవు డభిగమశ్రుతిచోదితధర్మ్మవర్తి సౌ
జన్యనిధాను ణ్డర్త్థిజలజాతహితప్రియనందనుణ్ణు వా
గ్జన్యవిశేషనిష్టపదసత్యయుధిష్ఠిరుణ్డై వెలింగ్గె భూ
మన్యుకులోత్తము ణ్డతిసమగ్రత నెల్లణ్డు ధన్యు ణ్డున్నతిని.

10


ఉ.

పాలితధర్మ్మమార్గ్గు ణ్డనుపాలితసత్యవచోవిలాసు ణ్డు
త్క్షాలితపాపకల్మషనికాయవిశుద్ధపవిత్రగోత్రు ణ్డా
మ్లేలితసర్వ్వశాస్త్రమతి మిత్రజనాంబుజమిత్రమూర్త్తి ది
గ్లాలితకీర్త్తి నిశ్చలితలక్ష్మిసమన్వితు ణ్డెల్ల ణ్డుర్వ్వరను.

11
శ్రీయమరేశ్వరదేవరశ్రీపాదారాధకుణ్డైననల్లపాచార్య్యనిలిఖితము

(ఆస్తంభముమీఁదనే వేఱొకప్రక్కను)

చ.

క్రితకనియోగలబ్ధ మగుకేవలలక్ష్మికి న్వీంగి గర్వప
ర్వతశిఖరాధిరూఢు లగువారల నవ్వు ననింద్యమూర్త్తి ని
ర్గ్గతకలికాలకల్మషుండు గావున నెల్లండు ని(ర్మళాతిని)
శ్చితమితవాణి గావున విశుద్ధయశోనిధి (దా)న కావునను[2]

12


సీ.

సకంద్రిపావనీపాల[3]నికర మంబరగజ
            వియదిందుసంఖ్యం దద్విషువదమల
సంక్రాన్తివేల నిశ్చలభక్తితో దీప
            (మా)చంద్రతారార్క్కమై వెలుంగ

  1. మై
  2. ఈపాదమందు యతి తప్పినది.
  3. "శకనృపవత్సర" అని యుండవలయును.