పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/60

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్తారుండు వాముదిండి[1]విభుండు
సారగుణుండు పుట్టె నయితశౌరి ధరిత్రిని.

1


క.

ఆతనికిం బుణ్యధన్యున
కాతతగుణమణికి మేడమాంబకు ధర్మ్మో
పేతుండు వారిజభవసం
జాతకులోత్తముండు పుట్టెం జామెస యనంగాను.

2


క.

సీతకీర్త్తి సామిరాజున
కతులితచారిత్ర గుండమాంబకు లక్ష్మీ
పతిసముండు పుణ్యచరితుండు
ధ్రితిసురగిరినిభుండు బ్రమ్మదేవండు పుట్టెను.

3


క.

మతిగురుం డాబ్రమ్మన శ్రీ
యుతుం డనఘుండు భూసురాన్వయోత్తముండు దయా
న్వితుండై ధర్మ్మువు......
మతిపట్టియ వేదవిహితమార్గ్గుండు భక్తిని.

4


సీ.

అంబరవసువియదమ్రితాంశుమితశక
            ధాత్రిపాబ్దములు[2] బహుధాన్యవర్ష
వైశాఖసితపక్షవారిజోదరతిథి
            గురువాసరమున సగుర్వ్వు గాంగం
గడుభక్తి విషువుసంక్రాంతిం గొట్టియదొన
            శంకరునకు భక్తశంకరునకుం
బరమధర్మ్మాత్ముండు బ్రమ్మదేవండు దన
            తల్లిదండ్రులకును దాతలకును

  1. ఇచ్చట నొకమాత్ర యధిక మైనది. "వామ్దిండి" అని చదువఁదగును.
  2. ఇచ్చట నొకమాత్ర యధిక మైనది. లువర్ణము వదలి పలుకవలయును.