పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/59

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పల్లి నాగేస్వరునకు[1] దీపం బఖణ్డ
వర్త్తి యాచంద్రతారకవర్త్తి గాంగ
నిలిపె రసగిరివ్యోమేందువిలసితంబు
లై శతాబ్దంబు లుర్వ్వర నభిమతముగ.

1

——————

39

శ. స. 1076

(ఈశాసనము కృష్ణామండలములో పెద్దకళ్లేపల్లి గ్రామమం దున్న శ్రీనాగేశ్వరస్వామిగుడిలో నొకఱాతిస్తంభముమీఁద చెక్కబడియున్నది. South Indian Inscriptions Vol. VI. No. 87.)

స్వస్తిశ్రీ॥


ఉ.

బల్లనరేంద్రువల్లభి (శు)భస్థితిం గామపరాణి శ్రీకడ
(ల్పల్లిభు)జంగమేశునకు భక్తి న(ఖం)డితదీప మాశశాం
కోల్లసితా(భ) మై వెలుంగుచుండంగ నిలిపె[2] ర(సా)ద్రిఖేందులను
సల్లలితంబు గాంగ ....... శారదములు ధరణీతల(౦బు)నను.

1

—————

40

శ. స. 1080

(ఈ పద్యములు గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందు శంకరేశ్వరస్వామి యాలయమునం దొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నవి. వీనికి ముందు కొంత వచనభాగము కలదు. South Indian Inscriptions Vol. VI.No. 625-1)

క.

శ్రీరమణుం డర్త్థిసూరిచ
కోరసుధాకరుండు హరితగోత్రుండు గులని

  1. నాగేశ్వరునకు
  2. నిల్పె