పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/57

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37

శ. స. 1076

(ఈశాసనము కృష్ణామండలములో అవనిగడ్డగ్రామమందు లక్ష్మీనారాయణస్వామి యాలయమునం దొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South India Inscriptions Vol. IV. No. 943.)

క.

శ్రీకమనియ్యుండు పుణ్య
శ్లోకు (డ)ధఃక్రితవిలాససురవిభుండు జితా
మిత్రానీకుండు[1] యశ
శ్రీకరుణ్డు[2] వెలనాంటి గొంకనృపసింహుం డిలను.

1


ఉ.

ధారుణి నట్టి గొంక్కవసుధావిభు నన్వయభ్రిత్యుం డైనకొ
ల్లూరివిభుండు శౌర్య్యగుణ మొప్పంగం జింతమనాయకుండు దే
జోర(మ)ణియ్యుం(డై ) పడసె సుస్థిరలీల వెలుంగంగాం బ్రతీ
హారిపదా(ర్త్థ) మాద్యమున నారవితారకశాసనంబుగాన్.

2


క.

ఆతనికి వికసితాంభో
జాతానన గుండమకును జన్మించె జగ
త్ఖ్యాతుండు ముత్తమనాయకుం
డాతతతేజుండు నాయకాభరణుం డై.

3


చ.

క(లి)యు(గ)శూద్రకుం డన జగంబున వీరగుణప్రసి(ద్ధుం)డై
వెలసినయట్టి ముత్తనకు ... మద(నా)౦గ్గి సుమధ్య పుణ్యదో
హళి యననొప్పు(మే)డమకు నభ్యుదయంబుగం బుట్టె నంబుజో
(జ్వ)లదలలోలనేత్రి మదసామజయాన లతా(సుమ)ల్లికా
మిలితసుగన్ధి గొమ్మమన మేరు(వదాన్య) మహీతలంబునన్.

4
  1. జితానేకామిత్రుండు
  2. శ్రీకుణ్డు