పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

పురగిరిదిక్తతిశకవ
త్సరములం బుణ్యతిథి విషువుసంక్రమమున ని
ద్ధర గొసనయసెట్టి సుధా
కరమౌళికి నిలిపె నావగంబము ప్రీతిని.

3

(ఈపద్యము పిదపఁ బై యర్థమే విపులముగా గద్యరూపమున వ్రాయఁబడియున్నది.)

—————

34

శ. స. 1073

(ఈశాసనము గుంటూరు మండలములో బాపట్ల గ్రామమందు శ్రీభావనారా యణస్వామి గుడిగోడమీఁద చెక్ట్ర ఁబడియున్నది. South Indian Inscriptions Vol. VI. No. 132.)

క.

శ్రీరమణు(౦)డర్త్తి[1] (పికసహ
కారు)౦డు వొఱండూరివిభుడు గశ్యపగోత్రో
ధారు(౦)డనం బరగె నిల సర
సీరుహసంభవకులుం(డు) శివదేవు(౦)డనను.

1


క.

(ఆ)తనికిం బుణ్యమూర్త్తికి
నాతతగుణనిధికి గుండమాంబకు ధర్మ్మో
పేతుండు సత్యనిత్యని
కేతనుం(డై) పుట్టె మంత్రి కేత(౦)డు పేర్మ్మిని.

2


చ.

అతనికి(౦) బ్రీతు(౦)డై ముద్దమాంబకు[2](౦)
బుట్టె నమాత్యవిద్ద(౦) డూ
ర్జ్జితనయశాలి యాతనికి సింధురగామిని దోనమాంబకును

  1. "డర్త్థి" అని యుండవలయును.
  2. "ముదువమాంబకు"- అని యుండవలయును. చూ. శా. 27