పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/52

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33

శ. స. 1073

(ఈశాసనము గుంటూరుమండలములో నరసారావుపేఁట తాలూకాలోని చెన్నుపల్లి అగ్రహారమందు పశ్చిమపుదిక్కున పరసవేదీశ్వరస్వామి యాలయమం దొకశిలాస్తంభముమీఁద చెక్కఁబడియున్నది.)

స్వస్తిశ్రీ.


సీ.

 శ్రీకుబేరాన్వయశఖురుం[1] డనఘుండు
            వాసయసెట్టికి వనజపత్ర
నేత్రి దండ్యమకు సుపుత్రుండు గొసనయ
            సెట్టి గొట్టియదొనం జెఱువు గుడియుం
గట్టించి పరివారగణసహితముగ సో
            మేశ్వరదేవర సాశ్వతముగ[2]
నిలిపి తటాకంబు మలపించి వ్రిత్తులు
            మానులకును గుడిసానులకును
నట్టవోజులకునుం బెట్టుచ హవిబలి[3]
యర్చ్చనలకు మేలియమదునకును
దేవభోగముగను దేవర కాచంద్ర
తారకముగం జెఱువు నూరు నిచ్చె.

1


క.

శ్రీవైశ్యవంశవర్ద్ధనుం
డీవసుమతిం గొసనిసెట్టి యీశ్వరునకు గౌ
రీవరునకు సోమేశ్వర
దేవర కొప్పంగ నఖండదీపము నిలిపెను.

2
  1. శేఖరుం
  2. శాశ్వతముగ
  3. "బెట్టిహవిర్బలి" అని యుండనోపు.