పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/50

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సంఖ్య సక[1]ధారుణీపాలు సమము లమరం
బ్రబలుచుండ నఖండదీపంబు నిలిపె.

1

—————

31

శ. స. 1072

(ఈశాసనము గుంటూరుమండలములో నాదెళ్లగ్రామమందు గోవర్ధనస్వామి యాలయములో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. IV. No. 806.)

స్వస్తి.


శా.

శ్రీమన్మూర్త్తి వడాలుకాటయకు రాజీవాక్షి సూరాంబ భూ
భామాసన్నిభ(నా) జనించె వినుతప్రా(ధా)న్య దత్కాంత్త కు
ద్దామశ్రీ జనిమించె[2] వెన్నమ మహాధర్మ్మిష్ఠి నాదిండ్ల(ను)
న్రామారత్నము నిలిపె[3] దీపము జగద్రమ్యంబుగా శౌరికిని.

1


క.

కరగిరిదిగ్మితశకవ
త్సరముల శుక్లసితపక్షదశమియు విధువా
సరమున శ్రీకేశవదే
వరకును దీపంబు నిలిపె వసుమతి వెలయను.

2

—————

  1. శక
  2. జనియించె
  3. నిల్పె