పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధ్యమందుఁగూడ హల్లుమాత్రముగానె యుండవలసిన నకారలకారము లచ్చుతోఁ గూడి కనఁబడుచున్నవి. ఉదా:- శకాబ్దములు (55-5) దుర్వ్వెవసాయులను(7-4) భంగదులు (12-4).

(ప) ఐ కి మాఱుగా, అయి, అయికి మాఱుగా, ఐ, తఱచుగా వ్రాయబడినవి. ​

(గ) అనుస్వారపూర్వకాక్షరము పెక్కుతావుల ద్విగుణీకరింపఁబడినది. అట్లు కానిచోటులునుం గలవు.

(జ) సంయుక్తాక్షరములలో రేఫపరక మగునక్షరము తఱచుగ ద్విగుణీకరింపఁబడినది. ఉదా:- కర్త్త (58-2) ధర్మ్మంబు (58-3).


(డ) క్రావడి యుండవలసినచో శకటరేఫ ముండుట. ఉదా:- పణ్డ్ఱెణ్డు(1) చెబ్ఱోలనుణ్డి (2-4).

(ద) ೞస్సి, అೞసిన (2-3) ఇత్యాదిశబ్దములందు ೞ యను వింతయక్కర మొక్కటి కనఁబడుచున్నది. ఇది యఱవములోని ௶, కన్నడములోని ೞ యనునక్షరములకు సజాతీయమైనది. దీనియుచ్చారణ మిప్పుడు డకారోచ్చారణముగా మాఱినది. ఈయక్షరమును గూర్చిన విమర్శన మాంధ్రసాహిత్యపరిషత్పత్రికలోఁ గననగు.

పైనుదాహరింపఁబడిన వర్ణక్రమదోషముల నన్నింటిని సవరించినచో గ్రంథవిస్తర మగునని విడిచిపెట్టినారము. పాఠకులు యథోచితముగ సవరించుకొనవలయును.

II. శబ్దలక్షణమునకు సంబంధించిన ప్రయోగవిశేషములు—

1. సంస్కృతశబ్దములు కొన్నింటికి లక్షణవిరుద్ధములైన రూపములు కనఁబడుచున్నవి.

(క) కల్హారగంధి యనుటకు బదులుగా కలుహారగంధి యని (15-3).