పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/47

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దారామంబుల కెల్ల నాయకమునా నత్యుణ్నతిం[1] బొల్చుదా
క్షారామంబున నిల్పె దీపము సదాఖణ్డప్రభాభాసిగాను.

2

—————

27

శ. స. 1071

(ఈశాసనము గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందు శ్రీకేశవస్వామి గుడిగోడమీఁద చెక్కఁబడియున్నది. ఈ శాసనములో మొదట మూఁడుపద్యములును దరువాత నొకవచనమును బిదప నొకపద్యమునుం గలవు. మొదటి మూఁడుపద్యములును 34 సంఖ్య శాసనములోని పద్యములు నొకటే. మూఁడవపద్యము మొదటిపాదములో “ముద్దమాంబకు" అనుటకు బదులుగా “ముదువమాంబకు" అని యున్నది. ఇదియే సరియైనపాఠము. నాల్గవపద్యము మాత్ర మిచట వ్రాయబడుచున్నది — South Indian Inscriptions Vol. VI. No 643.)

క.

ధర గిరి ది గ్మితశకవ
త్సరములు ... ... ...
(శ్వరునకు) నఖండదీపము
మరుదధిపనిభుం డమాత్యమల్లండు నిలిపెను.

—————

28

శ. స. 1071

(ఈశాసనము గుంటూరుమండలములో బాపట్లగ్రామమందు శ్రీభావనారాయణస్వామి గుడిగోడమీఁద చెక్కఁబడినది — South Indian Inscriptions Vol. VI. No. 128.)

చ.

అరుదాల[2]ధర్మ్మవర్త్తి యగునంధనరేశ్వరు సర్వ్వ.. (వా
రికి)౦ బ్రభవించ్చె నావయ ..... శౌరివా

  1. నత్యున్నతిం
  2. గణమును బ్రాసయుఁ జెడినవి. "అకుతల" అని యుండనోపు.