క. |
(నిర)తము వేయిని డెబ్బది
(పరు)వడి శకునేం డ్లమర[1] భైర(య) భీమే
శ్వరునకు నిలిపె(ను) మహి సు
స్థిరమై యుం(డ)గ నఖండదీపము లొప్పను.
| 2
|
(దీని తరువాతిఱాయి భూమిలోఁ బాఁతుపడియున్నది)
25
(ఈశాసనము గోదావరీమండలములో దాక్షారామగ్రామముందు భీమేశ్వరాలయము గోడమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. IV. No. 1061.)
శా. |
...........................................
...........................................
భారద్వాజపవిత్రగోత్రుణ్డు నా[2] శుంభన్మూర్త్తి సద్వర్త్తి వొ
ల్పారంగ్గా నుదియించ్చెం[3] బ్రోలణ్డు ది........స్పురత్కీర్త్తి యై[4]
| 1
|
ఉ. |
అర్జ్జునకీర్త్తిలోలుణ్డు సహస్రకరోపమతేజు ణ్డాసహ
స్రార్జ్జనపౌరుషుణ్డు శచివాగ్రణి[5] సప్తతపుణ్యసంచయో
పార్జ్జితు ణ్డింద్రధేనుదితిజాభవదాన్యుణ్డు దణ్డనాథనా
గార్జ్జును తమ్ముంబ్రోలణ్డు[6] ధరామరవంశలలాము ణ్డుర్వ్వరను.
| 2
|
- ↑ నేండు లమర
- ↑ గోత్రుణ్డును
- ↑ నుదయించ్చెం
- ↑ దిశాహారస్ఫురత్కీర్త్తియై - అని యుండనోపు.
- ↑ సచివాగ్రణి
- ↑ తమ్ముంబ్రోలణ్డు - ఇది ప్రయోగవిశేష మని గ్రహించునది.