|
పరుండు ధీరుండు శత్రుభంజనుం డాది
పతి ద్రిభువనమల్లపార్ద్ధివోత్తముండు.
| 1
|
తరువోజ. |
జలనిధిరసవియత్శశిసంఖ్య
దనర
శకునేండ్లు దుందుభిసంవత్సరము(న)
విలసిత మగుతులావిషువుసంక్రాంతి
వెలసిన కమ్మమెలు విన[1] బల్లికుఱువ
యలకాపురికి నెనయగు కొట్యదొన మ
హాదేవునకు నిచ్చె నాదిత్యవంశ
తిలకుండు డెంక్కణాదిత్యుం డూర్జితుండు
త్రిభువనమల్లధాత్రీనాథుం డుర్వ్వి.
| 2
|
|
భూమిదానాత్పరం దానం- ఇత్యాది.
|
|
18
(ఈశాసనము గోదావరీమండలములో దాక్షారామగ్రామమందు భీమేశ్వరాలయమం దున్నది- South Indian Inscriptions Vol. IV, No. 1169.)
చ. |
తదవరజుండు బాన్ధవనిధానుణ్డు మానధనుణ్డు సూరిహృ
ద్వదనస(రోజభానుణ్డు) దివాకరు ణ్డుజ్వలకీర్త్తి చ(౦ద్ర)మా
సదమల[2]సర్వ్వదిగ్ముఖుణ్డు జంగమకల్పమహీరుహంబు భూ
విదితమహానుభావుణ్డు (ప)విత్రచరిత్రుణ్డు వాత్రు ణ్డీక్షితిని.
| 1
|
- ↑ కమ్మమెల్విన
- ↑ చంద్రమస్సదమల