15
(ఈశాసనము గుంటూరుమండలములో నాదెళ్లగ్రామమందు మూలస్థానేశ్వరాలయములో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడి యున్నది. South Indian Inscriptions Vol. IV. No 672.)
ఉ. |
హారతుషారశంఖవిమలాభ్రమహోజ్వలకీర్త్తిం జాలం బొ
ల్పారిన బుద్దమండలికు నగ్రసుతుం డగుమన్నమండం డా
చారపరుండు నాదెండ్లం[1] జారుతరం బగువెండికొండ నాం
గోరి శశాంక్కమాలికి విగుర్వ్వునతో[2] గుడి నిల్పె భక్తునను[3].
| 1
|
చ. |
గడియమదేవిన౦ద్దనుం డగన్య[4]గుణాకరధర్మ్మశీలుం డి
ప్పుడమి వెలుంగు నొంచెడ్లపూడి[5]మహేశున కిందుమౌలికిం
గడు ననురాగ[6]చిత్తమునం గల్లి నిజం బగుచుండ నిచ్చె నీ
జడనిధులుం దివాకరుండు జంద్రుండునుం గలయంతగాలమును.
| 2
|
ఉ. |
మేరుగుణావతారుం డగుమేడనికిం గలుహారగన్ధి అం
భోరుహ[7]నేత్రి అన్వయ[8]విభూషణి నాందగు మేడమాంబకునుం
గారవలీలం బుట్టి గుణగౌరవసంపద విస్తరిల్లి గా
న్ధారికి సీతకు న్శచికిం దా నధికం బని బ్రస్తుతింప్పం[9]గాను.
| 3
|
- ↑ నాదెడలం
- ↑ విగుర్వ్వునతో అనునది సాధువుగాఁ గాన్పింపదు; విగుర్వ్వు శబ్దమైనచో నకారమునకుఁ బ్రసక్తి లేదు. విగుర్వ్వణశబ్దమైనచో విగుర్వ్వణముతో నని యుండవలయును.
- ↑ భక్తినిన్
- ↑ గణ్య
- ↑ నొంచెడలపూండి
- ↑ అనురాగ = అనురాగము. ఈశబ్దమును జరిత్రాదిగణములోఁ జేర్చినదో మువర్ణలోపము సిద్ధించును.
- ↑ యంభోరుహ
- ↑ యన్వయ
- ↑ "ప్రస్తుతింప్పం" అని యుండవలయును.