పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

శ. స. 1059

(ఈ శాసనము గుంటూరుమండలమందు కొణిదెనలో శ్రీశంకరేశ్వరస్వామియాలయమం దున్న యొకఱాతిస్తంభముమీఁద నున్నది. Government Ephigraphist's Collection No. 165 of 1899)

స్వస్తి

చ.

త్రిభువనగీతకీర్త్తి నరదేవశిఖామణి గామధారుణీ
ప్రభుతనయుండు మండలికభగ్గుండు[1] భర్గ్గపదాబ్జషట్పదుం
డభినవరాముం డర్య్యమకులాగ్రణి గుండియపూండి భక్తితోం
ద్రిభువనమల్లదేవండు వ్రతీతిగ శంభున కిచ్చెం బేర్మ్మితోను.


స్వస్తి చరణసరోరుహ... ... ...... శ్రీమన్మహా
మండలేశ్వర త్రిభువనమల్లదేవచోడమహారాజులు శకవర్షంబులు
1059 యగు నేంటి విషువుసంక్రాంతిని...

————

  1. భర్గ్గుండు