పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/22

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పడిసినయర్త్థ మిష్ట్లకు[1] బన్ధుజనాలికి దీనకోటికిని
గుడ్ల[2] కవారిసత్రములకుం జను సుద్ధ[3]చరిత్రం బాత్రమై[4].

————

10

శ. స. 1052

(ఈశాసనము గుంటూరుమండలములో నాదెళ్లగ్రామమందు మూలస్థానేశ్వరాలయములో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. IV. No. 677.)

★ ★ ★ ★ ★

శ్రీమన్మహామండలేశ్వర బుద్ధనరేంద్రునకు॥


ఉ.

శ్రీరమణీలలాముండు వశీకృతవీరవిరోధి హారనీ
హారసరోజరాజహరహాసయశోనిధి వందిబ్రిందమం
దారుం డపారవిభ్రమజితస్మరమూర్తి సతుర్త్త[5]వంశని
స్తారకుం డెఱ్ఱమండండు బుధప్రణతుం డుదియించ్చె[6] వానికిని.

1


క.

సూరికవిస్తుతు ణ్డనఘుండు
చారుచతుర్త్థాన్వయాబ్ధిచంద్రుణ్డు గులని
స్తారకుణ్డు సుజననిధి రిపు
వారణగజరిపుణ్డు బుద్ధవర్మ్మ జనించెను.

2
  1. మిష్టులకు
  2. గుడుల
  3. శుద్ధ
  4. శుద్ధచరిత్రపాత్రమై యని యున్నఁ గవిహృదయానుసారముగా నుండు నని తోఁచుచున్నది.
  5. చతుర్థ
  6. డుదయించ్చె