శాకే శాంబ్బక[1]బాణభూపరిమితే వ[ర్షేచ వి]శ్వావసా వౌన్నత్యేన చిరాయుషాచ గుణభాజా చంద్రతారం భువి॥ యస్యా నంత్తనృపేణ తేన జనకే నైవోటుకూరీరణే ప్రాప్త స్సిద్ధవటో య ముజ్వలశిలాసాలో విశాలః కృతః॥
[శాలి]వాహననామశకవర్షములు వేయు నేనూంటయిరువదియేడు చనిన విశ్వావసు వనంగ్గ వెలయు వత్సరమున సకలహిందూరాజ్య సార్వభౌమ వీరవేంకటరాయవిభుండు చంద్ర[గిరీంద్ర] సీమసామ్రాజ్యంబ్బు సేయుచుండ జంబ్బులమడకభూసంగ్రామజయశాలి కటకపురీచూరకారహారి నందేలక్రిష్ణమనరనాథభయదాన దక్షదోర్దండవిచక్షణుండు అఖిలకర్న్నాటసింహాసనాధీశ్వర దక్షిణబాహాభిధానధారి విదళితకొండ్రాజు వెంకటాద్రివిభుండు చెంన్నూరిహరణసంపన్నగృహుండు విబుధస్తుతకకుస్థవిజయప్రబంధాది కావ్యనిబంధనగ్రంథకర్త శ్రీమదెల్లమరాజు చెరువు[పే]ర తటాక ఘటనానుభావసంఘటితయశుండు