పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/116

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మలిపించ్చి తెప్పించి నిలిపించె కంభముల్[1]
            తలంప[2] గోచరమైన తరము లెత్తి
జగతి ఆచంద్ర[3]తారార్క మగుచు నెరయ
నికిలజను లలక ప్రఖ్యాతిని వహించె[4]
(భాగ్యసవుభాగ్యనిధి)[5] పరమవైష్ణవసజ్జనపారిజాత
కోరి సద్గుణమణి పెదకూరపాటి(వంశాబ్ధిచంద్ర)
దీపితోదారి మాదయగోపశవురి.[6]

1


ప్రమాదీచసంవత్సర పుష్యశు 10 సో॥ కూరపాటి గోపినేండు
దుగ్గెవంకేశ్వరదేవుని కంభంప్రతిష్ట సేశను.

——————

82

శ. స. 1500 ప్రాంతము

(ఇది కర్నూలుమండలములోని ఎగువ అహోబలమందు అహోబలస్వామి యాలయముగోడమీఁద నున్నపద్యము. వ్రాఁతతప్పులు పెక్కులు గలవు. లిపిని బట్టి శాసనము 1500 ప్రాంతము దనవచ్చును.)

సీ.

తిరిగెం గవ్వంబై శరధిలో నొకకొండ
            వుగృనివిల్లయ్యె నొకకొండ
ఆలంగా(చు)టకై హరియెత్తె నొకకొండ
            వుదధిలోపల దాంగె నొకకొండ

  1. కంబము
  2. తలంపం
  3. నాచంద్ర
  4. "నిఖిలజగములం బ్రఖ్యాతిని వహియించె" అని యుండనోపు.
  5. కుండలీకరణములు చేసిన భాగములు విడిచినచో నైదుగీతపాదము లగును. పెక్కుచోటుల విసంధు లున్నవి.
  6. శౌరి