పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/113

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

శ. స. 1462

(ఈపద్యములు గుంటూరుమండలమునందు వంకాయలపాడుగ్రామములో గోపినాథసముద్ర మనుపెద్దచెఱువు గట్టుక్రింద నున్నశిలాస్తంభముమీఁది పెద్దసంస్కృతశాసనముచివర నున్నవి. ఈశాసనములో కర్ణాటరాజగు అచ్యుతదేవరాయలమంత్రి రామయ భాస్కరునిసోదరియు "ప్రతాపయల్లప్రభు" ధర్మపత్నియు నగు చిన్నాంబ గోపినాథసముద్ర మనుపేర నొకతటాకమును 1462 వ శకసంవత్సరమందుఁ ద్రవ్వించె నని చెప్పఁబడినది.)

సీ.

చతురజనానీతసప్తపావననదీ
            తీర్థపవిత్రితాధికజలంబ్బు
సవిధదేశవిశాలసరసరసాలాది
            ఫలరసజంబ్బాలభాసురంబ్బు
కలకంఠచంచ్చరీకశుకకలాలాప
            కలితమందమనోజకౌతుకంబ్బు
ఘటితకుల్యాగతఘననీరసంచ్చార
            సంవర్ధితానేకసస్యచయము
చక్రవాళాచలోపమచారుసేతు
బంద్ధబంద్ధురనీరంధ్ర(భా)సురోర్మి
చుంబ్బితా(౦బ)ర మత్యంత్తసుకృ( )ణిస
నాథశుభనిధి శ్రీగోపినాథజలధి.

1


సీ.

జనతృష్ణమాన్పని జలముం బూనకయున్న
            పవనజుచే దాంటంబడకయున్న
మంథానభూధరమథితంబు గాకున్న
            మాంటిమాంటికి నుబ్బి మరలకున్న
గరళంబు దనలోనం గలిగి లంగకయున్న[1]
            నొకవే(ల)లోంబడి యుండకున్న

  1. "లొంగకయున్న" అని యుండవలయునా?