పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/111

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

శ్రీశ్రి(త)వ(క్షు)౦ డింద్దుకులసింధుసుధాకరమూర్త్తి సంతతో
పాశ్రితబంధురక్షణకృపావశవర్త్తి చతుస్సముద్రస
మ్మిశ్రితకీర్త్తి లోభినృపమిండం... డికరి[1]సర్వ్వ లో
కాశ్రయచక్రవర్త్తి మహిమాఢ్యుండు నాగయయెఱ్ఱం డుర్వ్విలోను.

1

—————

78

శ. స. 1453

(ఇది గుంటూరుమండలములోని ఎనమదలగ్రామమందు వీరేశ్వరస్వామి గుడిప్రాకారముమీఁద నున్నశాసనము.)

సీ.

గుణబాణగతిచంద్రగణనంబు శాలివా
            హనశకవర్షంబు లవనియందుం
బరగు నందనభాద్రపదశుద్ధదశమిని
            సోమవారమునాండు ప్రేమతోడ
నెనమదల[2] వీరన్న కిరువుగాం బ్రాకార
            మును భోగరాగంబు లనువు పఱచె
తననాథుం డయ్యపదండ్డనాయకునకు
            పుణ్యంబుగా నని బుధులు పొగడ
తారతారకమందారశారదాభ్ర
తుహినహిమకరవిఖ్యాతి నహరహంబు
గెలుచు సత్కీర్తి ధనముగా మెలంగ నేర్చు
మల్లనరనాథుచినబొమ్మమనుజవిభుండు.

1


స్వస్తి శ్రీజయాభ్యుదయ శాలివాహనశకవరషంబులు 1453
అగు నేంటి నందనసంవత్సర భాద్రపదశుద్ధ 10 సోమవారమునాండు

  1. గణము తప్పినది.
  2. "నెనమదల్" ఒకమాత్ర యధికముగా నున్నది.