పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/109

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సత్రంబుం జలివంద్రి సతతంబు వేడ్కతో
            విలశిల్లంగం[1] బెట్టి వెలయు నితండు
ముదమంద వేమాద్రి[2]ముండ్రేవు క్రిష్ణకు
            సౌపానములు దీర్చ్చెం జతురుం డితండు
చెఱువులుం బెండ్లిండ్లుం[3] జేయించ్చం బ్రేమతోం
            గలిగిన సత్కీర్త్తి ఘనుం డితండు
అనుచుం గొనియాడుదురు నింన్ను నఖిలసభల
మలుక మహబూపు వరపుత్ర కలితఘాత్ర[4]
దానగుణశీల నింర్మ్మల[5]ధర్మ్మలోల
మహితగుణసాంద్ర యీజెదీమలుకచంద్ర.

3

శుభమస్తు.

—————

76

శ. స. 1350

(ఈశాసనము గోదావరీమండలములో పిఠాపురమునందు కోమటిపేఁటలో నున్నఱాతిమసీదు వీథియరఁగుమీఁద నున్న యొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. ఈ మసీదులోనే వేఱొకచోట నున్న యింకొకశాసనములో “స్వస్తి శ్రీశకభవర్షంబులు 1352 అగు నేంటి సాధారణసంవత్సర మాఘ శు 7 శు గొంతిమాధవపెరుమాళ్ళకును వాసిరెడ్డి పోతినేండు నగరిదక్షిణభాగాన లక్ష్మీదేవమ్మనగరు కట్టించి ప్రతిష్ఠ చేయించెను." అని యున్నది.)

  1. విలసిల్లంగం
  2. "వేదాద్రి" అని యుండనోపు.
  3. బెండ్లిండ్లు
  4. గాత్ర
  5. నిర్మ్మల