పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/106

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(దీనితరువాత నీయర్ధమునే తెలుపు సంసృతపద్యములుగలవు. ఆపద్యముల చివర —

విద్యాధికారీ శ్రీనాథో వీరశ్రీ వేమభూపతేః
అకరో దాకరో వాచాం నిర్మళం ధర్మశాసనం.

అనియున్నది.)

—————

73

శ. స. 1337

(ఈశాసనము గుంటూరుమండలములో అమీనాబాదాగ్రామమున కీశాన్యమూల నున్న పుల్లరిబో డనుకొండ పడమటిప్రక్కను వరాలగాది యను బండ కుత్తరముగా చెక్కఁబడియున్నది. Government Epigraphist's Collection No. 543 of 1909.)

సీ.

శాకాబ్దములు సహస్రంబును మున్నూంట
            ముప్పదియేడును యొప్పు[1] మిగుల
మహనీయ మైనమన్మథవత్సరంబున
            మఖమాసమునం బూర్ణ్నిమాదినమున
హేమాద్రిదానచింతామణి యరిరాయ
            బసువశంకరుం డాజిఫల్గునుండ్డు
సమదారిరాయ వేశ్యాభుజంగుండ్డు వే
            మయ రాచవేమనక్ష్మావరుండు
దల్లి సూరాంబచే సముత్పంన్న మగుచుం
బరగు సంతానవార్ధికి వరువగాంగ
నొలయు గిరివాహినుల జగనొబ్బగండ
కాలువ ఘటించె నాతారకంబుగాంగ.

1

శ్రీనాథకృతి

  1. నొప్పు