|
గనకకుంభతతులు గాంగ దాక్షారామ
మన్నవో(౦తు) వేమనానుజుండ్డు
గడు నపూర్వ్వశ్రిష్టి[1] గావించి వాసన
కెక్కె శ్రీవేమ సితయశుండ్డు[2].
| 1
|
|
ప్రకాశభారతీయోగికావ్యం। పెద్దనాచార్య్యలిఖితం॥
|
|
72
(ఈశాసనము గుంటూరుమండలములో ఫిరంగిపురముగ్రామమందు వీరభద్రస్వామిగుడి యెదుట శిలాస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. Epigraphia Indica Vol. XI.)
సీ. |
శాకాబ్దములు సహస్రమును మున్నూంటము
ప్పదియొక్కండును నైన భవ్యసంఖ్య
వఱలు విరోధిసంవత్సరంబున ఫాల్గు
నంబున బహుళపక్షంబువిదియ
శుక్రవారంబున శుభముహూర్తంబున
శ్రీధాన్యవాటిపురాధిపతియుం
గ్రిష్ణవేణ్నాజలక్రీడావినోదుండ్డు
నగుగన్నభూపాలుననుంగుంబుత్రి
వీరనారాయణుండు వేమవిభునిదేవి
భూరిసద్గుణనికురుంబ సూరమాంబ
జగము వినుతింప సంతానసాగరాఖ్య
వరతటాకప్రతిష్టోత్సవం బొనర్చ్చె.
| 1
|
- ↑ సృష్టి
- ↑ నాల్గవపాదము "శ్రీలకెక్కె వేమసితయశుండు" అని యుండనోపు.