పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/102

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వంటయిండ్లు[1] సతుర్ద్వారకవాటములు
            వ్రేమ దాక్షారామభీమనాథు
నగర నాచంద్రతారకోంన్నతులు దిశల
వెలయం జేయించ్చె ననవేమువేచురాను(?)
విజయ[2]చండ్డధాముని[3] జగనొబ్బగండ్డం డహిత
ఖండనోద్దండదోర్ద్దండ్డమండ్డనుండు.

1


ప్రకాశభారతీయోగికావ్యం। పెద్దనాచార్య్యలిఖితంశ్రీ।

—————

71

శ. స. 1303

(ఈశాసనము దాక్షారామములో భీమేశ్వరాలయమున నున్నది. శాసనకాలము చెప్పఁబడలేదు. కాని, కావ్యకర్త యొక్కఁడే కావున 70 వ శాసనము నిదియు నేకకాలమునందే పుట్టియుండు నని యూహింపఁదగియున్నది. South Indian Inscriptions Vol. IV. No. 1380.)

సీ.

అమరాద్రి భీమేశ్వరావాస మబ్ధిస
            ప్తకము శ్రీసప్తగోదావరంబు
వలయాచలేంద్రంబు వజ్రపుఱాకోట
            గులపర్వతంబులు గోపురములు
దిరుచుట్టుమాలియ యరవిందజాండ మ
            మర్త్యలోకము నాట్యమంట్టపంబు
పరివారదేవతాభవనంబు లీచతు
            ర్దశభువనంబులు (దా)రకములు

  1. యిండులు
  2. "విజయ" అను పద మధికముగా నున్నది.
  3. "చండధాముండ్డు" అని యుండనోపు.