పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/100

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జగములు న్రోవం బాంచాళిపురంబు శ్రీ
            గోపళయ్యమనసు కోర్కి దీర్ప్ప
అరుగ భూవరు ణిచ్చె[1] నని చెల్లనిచెను[2]
            బుడ్డాంకుం టెంబది[3]పుట్లు పొలము
అదియు నూరుగా సమర్పించెం జెనుకాలి
సింగవిభుండు నారసింహ్వునకును
నారసింహ్వపురము నలినొప్పుచు నన
వేమ మహీంద్రు[4]పుణ్యవిహర మయ్యె.

4

—————

68

శ. స. 1298

(ఈశాసనము గుంటూరుమండలములో అమీనుబాదాగ్రామమందు మూలంగూరమ్మగుడి యున్నకొండమీఁద చెక్కఁబడియున్నది.)

సీ.

శాకాబ్దములు సహస్రమును నిన్నూంటతొం
            బదియెనిమిది యగు భవ్యసంఖ్యం
గలిగి యొప్పారెడు నలవత్సరంబున
            మాఘమాసము పూర్ణిమాదినమున
విశ్వోత్తరుం డనవేమభూపాలుండ్డు
            దమకులస్వామిని కమృతకిరణ
రేఖావతంసకు శ్రీమూలంగూరమ్మ
            కఖిలజగన్మాత కంగరంగ

  1. "భూవరుం డిచ్చె" అని యుండనోపు.
  2. నిచ్చెను
  3. డేంబది
  4. "నలినొప్పుచును ననవేమ మహిపు" అని యుండనోపు.