పుట:శాసనపద్యమంజరి.pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. దీర్ఘాసి

శ. స. 997

(ఈపద్యములు గంజాముమండలములో దీర్ఘాసి యను గ్రామమున “దుర్గమెట్ట”మీఁద నొకఱాతిపలకమీఁద చెక్కఁబడియున్న శాసనము చివర నున్నవి. శాసనపూర్వభాగ మంతయు సంస్కృతమున నున్నది. Epigraphia Indica Vol. IV)

సీ.

శ్రీశకునేణ్లు[1] భూపతిపై శైల
            నన్దాబ్జ భవసంఖ్య నొంది వేంగి
దేశంబు గిమిడియ గోసల గిడ్రిసింగి
            దేశంబు మఱియొడ్డ దేశ మనంగ
జనిన హూపాలుర ననినొచ్చె[2] చలమర్త్తి
            గణ్డణ్డై నెగడిన మణ్డలికుణ్డు
భూసుర వంశుణ్డు వాసవనిభభోగి
            బణపతి సౌజన్యగుణయుతుణ్డు
దీర్ఘాసి భగవతిదేవి దేవాలయ
            మున ముందటం గడుఘనతరముగ
మణ్డప మెత్తించె భణ్డనవిజయుణ్డు
            గణ్డగోపాలు డఖణ్డకీర్త్తిన్
దీనియ వెట్టె నద్దేవికి నవ్వేలం
            దనమనోవల్లభి వనజనేత్రి
దీవియ వెట్టెం బద్మావతియును క్షోణి
            నశశులు[3] గలయంతకును ముదమున

  1. నేణ్డులు
  2. నోచ్చెన్
  3. క్షోణి యినశశుల్