పుట:శాసనపద్యమంజరి.pdf/31

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ద్రాక్షారామం

శ. స. 987

(ఈశాసనము గోదావరిమండలములో ద్రాక్షారామం గ్రామమందుభీమేశ్వరాలయమున నొకఱాతిపలకమీఁద చెక్కఁబడియున్నది. Epigraphia Indica Vol. IV. NO. 1007)

శ్లో။

శాకే సంవత్సరేషుమున్ని (వ)సునిధిగే రాజమార్త్తణ్డభూXX
త్పు(త్రీ)సా...నేత్రీకనకరచితం కల్పభూజాతపుష్పం
ప్రాదాద్భీమేశ్వరాయ వ్యదిశ దథ సదా దీప్యదాచంద్రతారంxx
దీపం రౌప్యం చ పాత్రం బిససదృశ భుజా రేవి దేవీతనూజXX


సీ.

శ్రీవిష్ణువర్ధనభూవిభుదయ భూమి
            దేవిం బోల్ రేవల దేవి కనిన
సోమలదేవి గుణారామ[1] జగదేక
            సున్దరి మత్తేభ మందగమన
దొల్లి భీమేశ్వరవల్లభునకు సిత
            మణిబనధ మిచ్చె సన్మణియుతముగ
నురువిచ్చె గంగనా బరువడి వినివారిం[2]
            బురుడించునట్ల[3] సరసిజాస్య
గనకరచితరుచికరకల్పావనీరుహ
కుసుమ మిచ్చెం దనకు నసము వెరుగ
వెణ్డిమణ్డతో నఖణ్డితద్యుతి దీప
మమరనిచ్చె విమలకమలనేత్రి.

  1. ఇచట యతి తప్పినది. శ్యామలదేవి అనిన సరిపోవును గాని, సీసమందెల్లడఁ బ్రాసయతియే కనఁబడుచుండుటచే నాపాఠము కవిసమ్మతము కాదేమో యను సందేహము కల్గుచున్నది.
  2. వినువారిం-అని యుండనోపు.
  3. నట్టుల