పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/97

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్రరత్నాకరము

కష్టపడుచున్నాను. తుది లేని యట్టి యీ దుఃఖసముద్రమునుండి. విడుదల చెందు సుపాయమొక్కటి చెప్పవలయునని ప్రార్థింపఁగా శ్రీకృష్ణుఁడు ధర్మ రాజుతో ని ట్లనియె.

“ఓధర్మనందనా! అనంతవ్రత మసువ్రత మొకటగలదు. అయ్యది సకలపాపంబులను బోఁగొట్టి స్త్రీపురుషులకుఁ గోర్కుల నన్నిటి నొసఁగునది. శాశ్వతకీర్తిని, శాశ్వతసంపదను, పెక్కండ్రు. పుత్రపౌత్రులను అన్నియపేక్షలను నొసంగునట్టిది. ఆ వ్రతమును భాద్రపదమాసంబున శుక్లపక్ష చతుర్దశినాఁ డాచరింపవలయును. ఆవ్రతము నాచరించుటచే మానవులకు సకలపాపంబులు తొలఁగును.

అని శ్రీకృష్ణుఁడు చెప్పగా, ధర్మరాజు కృష్ణుని జూచి, "ఓకేశవా! నీవు అనంతుఁడని చెప్పితివికదా, ఆయనంతుఁ డెవ్వఁడు? ఆదిశేషుఁడా! తక్షకుఁడా! సమాత్మయా! లేక బ్రహ్మదేవుఁడా! ఈయనంతుఁ డనువాఁ దెవ్వఁడు; నాకు వాస్తవము నెఱిఁగింపుము" అని యడుగఁగా, శ్రీకృష్ణుఁడు వెండియు నతనితో నిట్లనియె.

ఓకుంతీపుత్రుఁడా! నేనే యాయవంతుఁడను. నేనే విశ్వరూపుఁడ నని నీకుఁ దెలియునుగదా. సూర్యునిసంచారముచే కళ, కాష్ఠ, ముహూర్తము, పగలు, రాత్రి, పక్షము, నెల, ఋతువు, అయనము, సంవత్సరము ఆనుభేదములు గల యేకాలము ఏర్పడుచున్నదో అది నేనే. ఆశ్రియవంతుఁడ నైన నేను సకలరాక్షసులను సంహరించి భూభారము తగ్గించుటకై భూలోకంబున వసు దేవునికులంబునఁ బుట్టితిని. నేనే అనంతుఁ