పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

వ్రత రత్నాకరము

1. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలంచంద్రబలంతదేవ, విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేం౽ఘ్రి యుగం స్మరామి.

2. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః, తత్ర శ్రీర్విజయోభూతిర్ధృవానీతిః మతిర్మమ.

3 . అనన్యాశ్చిన్తయన్తో మాం యేజనాః పర్యుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమంవహామ్యహమ్.

4. స్మృతేసకలకల్యాణభాజనంయత్రజాయతే, పురుషన్తమజంనిత్యం ప్రజామిశరణంహరిమ్.

5. సర్వదాసర్వకార్యేషు నాస్తి తేషామమఙ్గలం, యేషాం హృదిస్థో భగవాన్

1. ఓలక్ష్మీ దేవిభర్తా ! నేను నీపాదములను ధ్యానించు చున్నాను. నీ పాదముల ధ్యానించుటయే (నాకు) లగ్నము. అవే శుభదినము. అదియే తారాబలము. అదియే చంద్ర బలము. అదియే విద్యాబలము. అదే దైవబలము.

2. ఎచ్చట యోగేశ్వరుఁడగు కృష్ణమూర్తియు, గాండినధారియగు అర్హుసుండును నున్నారో, అచ్చట సంపద యు, జయమును, వైభవమును, బాయకయుండును.

3 . ఎవరితర కార్యములనెల్ల విడిచి నన్నే ధ్యానించుచు, నన్నే యుపాసన చేయుచున్నారో, ఎల్లప్పుడు నాకు భక్తులై యుండువారి యోగ క్షేమములను నేను విచారించుకొనుచున్నాను. (అని కృష్ణమూర్తి యర్జునునకు. జైప్పెను.)

4. స్మరించినమాత్రముననే సంపదల నొసఁగువాఁడును, సకలభూతముల లోపల నుండువాడును, పుట్టుక లేనివాఁ డును, శాశ్వతుఁడును నైన విష్ణుమూర్తిని నేను శరణుచొచ్చుచున్నాను. 5 - 6. మేలులకెల్ల నునికిపట్టును, నల్లఁగల్వవలె నల్లనైన వాడును, దుష్టులను ఓడించువాడును నైన శ్రీకృష్ణమూర్తి నేమానవులు తమ మనస్సులందుఁ దలఁచుచున్నారో, అట్టివారికిఁ