పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/32

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినాయక వ్రతము

31

ద్రౌపదిని సకలవిధంబుల బాధించి, మాపుత్త్రులనుజంపి, మాకుఁ దీరనిదుఃఖము గలిగించిరి. తమ దర్శన ప్రభావముచేతనే మా దుఃఖ మెల్లం దొలఁగినది. దయకు నిధివైన ఓమహాత్మా ! మా మీఁద ననుగ్రహించి, మాకు మరల రాజ్యము వడయుటకు సాధనమైన యొక వ్రతంబు ననుగ్రహింపవలయును” అని ధర్మరాజు సూతమహాముని నడుగఁగా, నమ్మునీంద్రుఁ డిట్లనియె.

సూత ఉవాచ___

    వ్రతం సంపత్కరం నౄణాం సర్వసౌఖ్య ప్రవర్ధనం,
    శృణుధ్వం పాణ్ణవాః సర్వే వ్రతానాముత్తమం వ్రతమ్ .

10. రహస్యం సర్వపాపఘ్నం పుత్ర పౌత్రాభివర్ధనం,
    వ్రతం సాంబశి వేనైన స్కన్దస్యోద్బోధితం పురా. "

తా. ఓపాండవులారా! మీరందఱు వినుఁడు. వ్రతములలో నెల్ల నుత్తమమైన వ్రతమున్నది. ఆవ్రతము మానవులకు సంపదను, సౌఖ్యములన్నిటిని వృద్ధినొందించునది. పరమగోప్యమైనది. సకలపాపములను బోగొట్టునది. పుత్రపౌత్రాదులను వృద్ధి చెందించునది. ఓ పాండవులారా! తొల్లి యీవ్రతమును పరమేశ్వరుడు కుమారస్వామికి నుపదేశించెను. కుమారస్వామి పరమేశ్వరుని పృచ్ఛచేసినరీతియు, ఆపరమేశ్వరుడు కుమారు నికిఁ బదులు చెప్పిన రీతియు నెఱిఁగించెదను వినుఁడు.

11. కైలాసశిఖరే రమ్యే నానామునిని షేవితే,
    మన్దారవిటపి ప్రాన్తే నానామణి విభూషితే.

12. హేమసింహాసనాసీనం శఙ్కరం లోకశఙ్కరం,
    పప్రచ్ఛ షణ్ముఖ స్తుష్టో లోకానుగ్రహ కాఙ్క్షయా

13. స్కన్దఉవాచ.
    కేన వ్రతేన భగవన్ సౌభాగ్య మతులం భవేత్ ,
    పుత్రపౌత్రాన్ ధనం లబ్ధ్వా మనుజః సుఖ