పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/14

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్రత రత్నాకరము

13

ఆ త్వా వహస్తు హరయస్సచేతసశ్శ్వేతై రశ్వైస్సహ కేతుమద్భిః, వాతాజవైర్బలవద్బిర్మనోజవైరాయాహి శీఘ్రం మమ హవ్యాయ శర్వోమ్.

(ఈమంత్రము చెప్పి అక్షతలు పుష్పములు తీసికొని ప్రతిమ శిరస్సున నుంచి చేతిని నెత్తినుంచవలెను) యత్కించిన్ని వేదనం కుర్యాత్. పిమ్మట అవసర నివేదనము (పండు బెల్లము మొదలగునవి.)

ప్రాణప్రతిష్ఠాపనవిధి సంపూర్ణము.

————♦♦————

——₪₪♦♦పూ జా ప్రా రం భ ము♦♦₪₪——

అథ వరసిద్ధివినాయకపూజావిధానమ్___

1. శ్లో. భవసఞ్చితపాపౌఘ విధ్వంసనవిచక్షణం, విఘ్నాన్ధకారభాస్వన్తం విఘ్న రాజమహం భజే, ఏకదన్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం, పాశాఙ్కుశధరం దేవం ధ్యాయేత్సద్ధివినాయకమ్. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం, ________________________________________________________________________________________ 1. శ్రీ వినాయక వ్రతము అన్ని వ్రతములలో మేలయినది. కలిమి నొసంగునది, శుభముల నిచ్చునది గనుక, సంసారమునఁ జేర్చిన పాపరాసులను బోఁగొట్టుటయందు దిట్టరియు, సూర్యునిమాడ్కి విఘ్న ములనెడి చీకటిం బోఁగొట్టువాడును, ఒంటికొమ్ముగలవాడును, చేటచెవులవాడును, ఏనుఁగుమోమువాడును, నాలుగు చేతులవాడును, పాశము అంకుశము అను నాయుధం