పుట:వెలుగోటివారి వంశావళి.pdf/83

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


యేకాంగవీరుండును నవలక్షతెలుంగు మిన్నండును,[1] బంచపాండ్యదళవిభా
ళుండును, రాయవేశ్యాభుజంగుండును, సర్వబిరుదురజగనొబ్బగండ సంగ్రామ
ధనంజయుండును,[2] ముప్పదిరెండుదుర్గవిభాళుండును, నేకధాటి విషమధాటి
సమర్థుండును,[3] మూరురాయరగండపెండేరంబు[4] డాకాలఁ బెట్టిన త్రిభువనీ
రాయరావన్నఁడని యెఱుంగక జల్లిపల్లివీరక్షేత్రంబున శార్వరి కార్తిక శుద్ధ
పక్షంబునందు నెదిరించిన యాఱువేల గుఱ్ఱంబులు నేడునూఱుల[5] మత్తే
భంబులు, నిరువదివేల కాలుబలంబులతో రాజుల కెదురు నడచి, తన హిత
పరిజనంబులు హంకారమానుషభీమభార్గవులైన పదివేల పద్మజులకును[6],
రణభయభంగవర్జితులైన తెలుంగలకును, గర్పూరతాంబూలాదు లొసంగి
రణోత్సాహులై, వీరరసము చిప్పిల, వీరహాహాకారంబులు వీరతమటంబులు,[7]
వీరభేరీరవంబు మ్రోయ[8] బడినాయంకులు, లెంకలు, సముఖపుఁ జనవరుల
కును,[9] బిరుదురాహుత్తులు మొదలైనవారికి బహుమానంబుఁ జేసి, కొని
యాడి నడచి తలపడి ఖండవిఖండశతఖండతుండంబులుగా నఱికి యట్ట
లాడించి, కొండమల్రాజు మొదలగు రాజుల[10] రణంబులోఁ జంపి, హత
శేషులు జల్లిపల్లికోటఁ జొచ్చినఁ గోట నెక్కి నూటొక్కరాజుల శిరంబులు
ఖండించి యేఁబది[11]యొక్క రాజులఁ గలుగాన్గ లాడించి, మఱియు ముప్పది
ముగ్గురు[12] రాజులఁ బట్టి పూజించి రణబలిగాఁ దెచ్చి యారణక్షోణి
నర్చించి[13] దిగంబరీ, కాళీ, మహాకాళీ,[14] శాకినీ, ఢాకినీ, బాయిళాకాయినీ
భూతప్రేతపిశాచంబులఁ దలఁచి, ‘రణదేవరా, మహారణరాజా, రణశూరా,

  1. A. B మిన్నండైన
  2. A. B ధనంజయుండైన
  3. A. B సమర్థమూరురాయరగండ
  4. A. B పెండారంబు
  5. A ఏళ్లూరు B. ఏళ్లూరు
  6. A. B. న్ను
  7. A. B. తమడంబులు
  8. A. B.మ్రోవ
  9. A. B. చనవర్లకున్ను
  10. A. B. మొదలురాజుల
  11. A. B. యాభై
  12. A. B. ముప్పై ముగ్గురు
  13. A. B. యారణక్షోణి యర్చించి
  14. A. B. మహంకాళికి