పుట:వెలుగోటివారి వంశావళి.pdf/76

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


మ.

లలిఁ గుంతావళి పచ్చతోరణము లీలన్ నిత్యకల్యాణమున్
గొలుపం[1] జూపఱ కద్భుతం బొదవఁగాఁ గుంట్లూరి యాయిమ్మడిన్
బలవంతున్ సబళానఁ[2] జెండి రణభూభాగంబునం గూల్చె నీ
చ్చలు భూనాథులు పిచ్చలింప నెఱిదాచక్షోణిపాలుం డొగిన్.

34


మ.

గరళం బుగ్రత వచ్చుచోట సురసంఘాతంబులో నిందుశే
ఖరుఁ డొక్కఁడును గానవచ్చుఁ; గడు వీఁకన్ బాండ్యసైన్యంబు భీ[3]
కరమై వచ్చినచోఁ దెలుంగు నవలక్షౌ సేనఁ[4] దెల్లంబుగా
నరలోకోత్తము నెఱ్ఱదాచవిభుఁ గాన[5] న్వచ్చు నాజిస్థలిన్.

35


చ.

వెలయఁ బ్రతాపరుద్రుసభ విశ్రుతి కెక్క భటాళి[6] చూడఁగాఁ
జలమునఁ గుంత మందుకొని చయ్యన వచ్చు[7] గజంబు నోర్చి దో
ర్బలభుజవిక్రమంబునను బైకొని తా జయలక్ష్మిఁ జేకొనన్
గెలిచెను బాండ్యరాజగజకేసరి దాచయశౌరి పాండ్యులన్.

35


ఉ.

కంచిసమీపమందు నతిగాఢమహోగ్రతఁ బంచపాండ్యులన్
మించిన విక్రమస్ఫురణ మీఱి విజృంభణ నంచితంబుగాఁ[8]
ద్రుంచి జయించి భూతములఁ దుష్టులఁ జేసె [9]రణంబున న్మహో
దంచిత[10]కీర్తిహారుఁ డెఱదాచనృపాలుఁడు భూతలంబునన్.

37
  1. A B. కొలయన్. It involves a breach of the rules of prosody. V.V.C.
    గలిగిపం గనువార లద్భుతసమాక్రాంతాత్ములై యుండఁగా । బలవంతుం డగు
    నిమ్మునిం గదన &c
  2. A B. సబలాన
  3. B. లన్
  4. A. B. లక్షల్ శాన
  5. A. B. నరలోకోత్తము డెఱ్ఱదాచ విభు గానం
  6. A. B. వెలయప్రతాపరుద్రసభ వర్ణన కెక్కి నటావలి చూడ నాజిలో. V.V.C. P 24 వెలయఁ బ్రతాపరుద్రవిభు వీరభటావళి చూడ నాజిలో
  7. A. B. and V.V.C. వచ్చి
  8. A. B. సంచితంబుగా
  9. A. B. త్రుప్తుల జే కరణంబు
  10. A. నందునో । యంచిత కీర్తిహారు; B. నొందునో । యంచిత కీర్తిహారుఁ