పుట:వెలుగోటివారి వంశావళి.pdf/195

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

131


ఉ.

బల్లరగండ యేచనరపాలకనందన రంగధారుణీ
వల్లభ నీప్రతాప మెటువంటిదొ కాని భవత్తురంగమున్[1]
బల్లనగట్టఁ బంపఁ బరపట్టణభూపులు[2] చిందువందులై
తల్లడమంది పాఱ నిజధాటికి మాటికిఁ జెప్పనేటికిన్.

389


సీ.

పూని నీపాదాలపై నాన వెట్టితే
        భయమంది పాఱెడు పాము నిల్చుఁ
బరరాష్ట్రముల నీప్రభావంబుఁ[3] జెప్పితేఁ
        బసిబిడ్డ వెఱచును బాలుఁ ద్రావ
నీదండయాత్ర వింటే దిశల్ దప్పి యి
        ట్టట్టౌను మూఁడుసింహాసనములు
హిమసేతుపర్యంత మీభూమి నీయాజ్ఞఁ
        దుదివ్రేలుఁ జూపితేఁ ద్రుళ్లిపడును
నీకు నీవు సమానంబు గాక యొరులు
సాటియే ధాత్రిపై వెలుగోటియేచ
విభుకుమార పదానమద్వివిధవిమత
వీరవేశ్యాభుజంగ కస్తూరిరంగ.

390


సీ.

ఆలోలకీలాకరాగ్రమై దావాగ్ని
        ఘోరాటవుల ముట్టుకొన్న యట్లు
చిత్రభ్రమణ లెగసిల్ల[4] మంథానాద్రి
        కలశాబ్ధి నురవడిఁ గలఁచినట్లు
విలయకాలాభీల[5]విపరీతవాయువు
        ధారాధరంబులఁ దఱిమినట్లు
గంభీరనిర్ఘోషకంఠీరవము రేఁగి
        హరిణవర్గము గంతు లడఁచినట్లు
నీవు రణమండలంబున నిలిచి వీర
కేళిఁ జూపినఁ బరమహీపాలబలము

  1. A.B. భవత్తురంగముకు
  2. A. వల్లనకట్టివన్క పరపట్టణభూములు B. వల్లనకట్టివెన్కపరపట్టణభూములు
  3. A.B. ప్రతాపంబు
  4. A. లెగశిల B. వెలశిల
  5. A.B. ప్రళయకాలాభీల