118
వెలుగోటివారి వంశావళి
నట్టిరాహుత్త[1]సంతతత్యాగభోగ భాగ్యశాలి పదానతపరనృపాల పాళి[2] వెలుగోటి చెన్నమ[3]ప్రభుకుమార హేళి[4] వేంకటపతిమహీపాలమాళి.
ఒకపాటికుట్ర[5] మన్నెగుమాళ్లు[6] నూఱార్లు గూడినఁ గన్నెత్తి చూడఁ గలరె యటుగాక రాయలంతటి వజీరులు వేవు రైనను నీవాటు కాఁగఁ గలరె డాక నెంతటి[7] కిరీటముల రాజులు లక్ష చేరిన నెదురాని పోరఁ గలరె మఱి పాదుశాహులె మెఱసి కోట్లకొలంది నిలచి పోరిన మీఱి గెలువఁ గలరె బలయు నీ దుముదారుపంపులకు నలుకు దురు మరుత్పతులైనను దుది నిజంబు[8] వి్న్నవించెద వెలుగోటిచెన్నభూమి పాలకుని వేంకటపతీంద్ర భాగ్యసాంద్ర.
మునుమున్నె తనఢమాధ్వని[9] విరోధినృసాల కుల దుర్గములు పెళాపెళలు[10] సేయ నటుచేరఁ దనతేజి పటుహేష లరిభూభు జుల గుండియలు గులాగులలు సేయఁ