పుట:వెలుగోటివారి వంశావళి.pdf/178

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

వెలుగోటివారి వంశావళి


నీవిధంబునఁ గఠిననిర్ణిద్రయవన
వాహినీఘోరరక్తప్రవాహనివహ
నవ్యసంధ్యాయమానపెన్నాజలౌఘ[1]
చిత్రితాటోప వెలుగోటిచెన్నభూప.

339


సీ.

నీ పేరు చెప్పిన నిష్ఠురారాతిబిం
        బోష్ఠుల గర్భంబు లూడిపడును
నీడాకఁ జూపిన నిర్దూమధామమై
        పరభూము లూడనిఁ బాడుచుండు
నీపంపుమాత్రాన నిజభుజహంకార
        మన్నెరాజన్యుల మదము లణఁగు
నీవు ముస్తీదైన నిఖిలదుర్గాధిప
        ప్రకరంబు గుండెలు పగిలిపాఱు
సాహసంబున నీయంత సార్వభౌముఁ
డరయ నెవ్వఁడు మూఁడు సింహాసనముల
భూరిగుణహార వెలుగోటిపురవిహార
భాగ్యసంపన్న కొండభూపాలుచెన్న.

340


ఉ.

క్రొత్తలుగాఁగ నేడు వెలుగోటిధురంధర చెన్న నీవు దం
డెత్తినవార్త [మున్మును] పొకింత వినంబడెనేని భీతిమై[2]
మత్తవిరోధిరాజు లభిమానము లూడిచి యెక్కడెక్కడేఁ
జొత్తురుగాక నీ కెదురు శూరులు లేరు ధరాతలంబునన్.

341


సీ.

యక్షరక్షఃకులాధ్యక్షశిక్షణ[3]దక్ష
        దీక్షోపదేశి నీకదృఢబలంబు
జంభసంభేదిదోస్తంభదంభోళిసం
        రంభగుంభనము నీరణవిధంబు

  1. A.B. నవ్య సంధానమానపెన్జితాఘ
  2. A.B. దండెత్తినవార్త యొకింత వినంబడెనేనిభీతిమె
  3. A.B. అక్షరక్షఃకులాధ్యక్షువీక్షణ