పుట:వెలుగోటివారి వంశావళి.pdf/167

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

103


వ.

అతనియనుజుండు.

294


గీ.

ఆమహాబలు సోదరుం డతిశయిల్లుఁ
బ్రతిభటుల గెల్చు నక్రూరభావ మలర
మెలఁగి యుద్ధవినీతుల మే లెఱింగి[1]
ధరణి వెలుగోటిరంగభూవరవిభుండు.

295


క.

రంగక్షితిపతి సాక్షా
ద్రంగపతిం దెలిపె నతదురంతైకదయా
సంగతి నతిసాత్త్వికబు
ద్ధిం గమలావిభవసంభృతిం బరికింపన్.

296


*స్రగ్ధర.

స్తంభీభూతక్షితీశాతతపటహధణంధాణశబ్దంబు మింటన్
గంభీరాయోధనప్రాంగణహతయవనగ్రామణీకోటిహృద్య[2]
ద్రంభావైవాహవేళాధ్వనితనిబిడవాద్య[3]స్వనంబై తరం బ్రా
రంభించు రంగభూపాగ్రణి పటుజయయాత్రల్ బలోద్దండలీలన్.

297


వ.

అతనియనుజుండు.

298


ఉ.

ఈక్షితిఁ గాశికానగరి నీల్గినమాత్ర లభించు నెంచఁగా
భిక్షపుఁగూడు యేచపృథివీ[4]తలనాథవతంసు ఖడ్గధా
రాక్షతి మేను వీడిన యరాతికిఁ గల్గు సుధారసంబు త
ద్భైక్షము మంచిదో యమృతపానము మంచిదొ యెంచి చూడఁగన్.

299


సీ.

పటికంపుశిలలలో పలినీడ నీవెంట
        వచ్చునె పిలిచిన వామనయన
పువ్వారుఁ దీగెలు బోంట్లె నీబడి నిట్టు
        లనుచరింపఁగ[5] ధవళాబ్జగంధి
శృంగంబుపై నున్న సింగంబు లాప్తులె
        తలయెత్తి[6] చూడను దలిరుఁబోఁడి

  1. A.B. మేలెరింగె
  2. B.P.; A.B. హతయవనకోటికుడ్య
  3. A.B. తూర్య
  4. A.B. ధరణీ
  5. A.B. పువ్వారు దీగెలబోండ్లు నీబడియెట్లు ననుచరింపగ
  6. A.B. లాత్మలె తలలెత్తి