పుట:వెలుగోటివారి వంశావళి.pdf/153

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

89


గా వడినె రంభ కైకొనె
యావడి సేయంగ దివిజు లక్కడ బెదరన్[1].

255


క.

సోమకులపరశురామో
ద్దామమహాబిరుదమునకుఁ దాతలకంటెం
బ్రేమమున వన్నెఁ దెచ్చును[2]
నీమహి వెలుగోటినాయనేంద్రుఁడు దలఁపన్[3].

256


వ.

అతని యనుజుండు.

257


సీ.

ఆజీముఖాను[4] వెన్నాడి పోఁడిమి బిట్ట
        దర మట్టితివి[5] పాండ్యదళవిభాగ
కలనిలోన యఖూపఖానుఁ బోఁ దోలవె
        పరువెత్తఁ బ్రతిగండభైరవాంక
కుదియించి యలచింత గుంటధర్మారావు
        నడఁచవె[6] రాయవేశ్యాభుజంగ
బతి[7]మాలఁజేసి భూపతిరావునాగని
        గావవె[8] రణలయకాలరుద్ర
చండించి దేవరకొండ ఠాణీలను
        మర్దించవే[9] చలమర్తిగండ

  1. A. దివిజులక్కడ బెదరిరీ; B. దివిజులక్కడజేరిరీ
  2. B. దెచున్
  3. A.B. ధాత్రిన్
  4. A.B. ఆజిముఖాన. V.V.C p 96. అజీజిజ్జూఖాను
  5. A. పోడిమిపెట్టదరమెట్ట; B. పోడిమిపెంటదరమెట్ట
  6. A.B. నడచెదె
  7. B. లతి
  8. B. కాలవె
  9. A.B. ధాణీలతలలు మొత్తించవే