పుట:వెలుగోటివారి వంశావళి.pdf/146

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

వెలుగోటివారి వంశావళి


పేరెములు వాఱు నీఖడ్గపెండ్లికొడుకు
అహహ! రేచర్లసింహాసనాధినాథ
గాయగోవాళ బల్లరగండబిరుద
రాయభూపాలుతిమ్మభూరమణుతిమ్మ.

236


సీ.

పగతుల నెత్తురు పైనూనెఁ బట్టించి
        ఘనత సత్కీర్తియన్ కాసెఁ గట్టి[1]
మొనసిన వైరుల మొగసాలఁ దానాడి[2]
        యుదిరిన దిక్కులయురువుఁ జూచి[3]
యహితభూపతులపై నారంగములు[4] గొని
        తివురు[5]భూపతులపై తిరుపుగట్టి[6]
కొసరు మన్నీలపైఁ గోలల[7] వెసనాటి
        చెలఁగు[8] భూవరులపైఁ జిందులాడి
వారి సప్తాంగములు చాగ[9]వహులు గొనియె
నిట్టి నీఖడ్గపుత్రికి నీడు గలరె
గాయగోవాళ బల్లరగండబిరుద
రాయభూపాలుతిమ్మభూరమణుతిమ్మ.

237


సీ.

కదనవారాశి రక్తమున స్నానము చేసి
        వైరి[10]చర్మంబు దోవతిగఁ గట్టి
సమదారి[11]ప్రేవులు జన్నిదంబులు వేసి
        తగవైరి మెదడు చందనము[12] దీర్చి

  1. A. ఘనతసత్కి త్రియుగాగ, B. సత్కీర్తియుగాగ
  2. A.B. మెనసినవైరుల మెగచాలి గానాడి
  3. A.B. వురువు చూచి
  4. B. భూపతులై సారంగములు
  5. A. తివిరిభూపతులవై; తిమ్మభూపతులలై
  6. A. తివురు; B. తివుర
  7. A.B. కోమల
  8. A.B. చలగు
  9. A.B. త్యాగవహిలు
  10. A.B. విమత
  11. A.B. సమరవైరి
  12. A.B. మెదడుగోపిచందనము