పుట:వెలుగోటివారి వంశావళి.pdf/143

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

79


బయిరువఖానునిఁ బాఱంగఁ దోలవె
        పరఁగంగ నిదె రొంపిచెరలయొద్ద
ఖానఖానుని హితఖానుని మొదలుగాఁ
        గొట్టి సప్తాంగముల్ గొనవె జగతి
ఆంధ్రదేశాధీశులయిన మన్నెలఁ బోర[1]
        రాల్పవె[2] మల్లాపురంబు బయట
నీవు జయశాలివైన ని న్నెదుర వెఱచి
సూరినాయనిసూరుఁడు సురుఁగు టరుదె
చారుమీనాంక రేచర్లశాసనాంక
రామభూపాలుతిమ్మభూరమణుతిమ్మ.

231


సీ.

గాయగోవాళుఁడు కదలి దండెత్తెనో
        యెడమక న్నదరెనే యిందువదన,
ఖడ్గనారాయణఘనుఁడు కోపించెనో
        తుమ్మి రొవ్వనివంకఁ[3] దోయజాక్షి,
దానచింతామణి తముకు వేయించెనో
        గుండె జల్లనియెనే కోమలాంగి,
వీశెపట్టుతలాటవిభుఁడు దా వెడలెనో
        దబ్బాటు వెట్టెనే తలిరుబోఁడి,
అంచుఁ దమకులసతులతో ననుదినంబుఁ
గాని శకునంబులందెల్పి[4] కల్వరించి
దాఁగియుందురు కానల దర్ప మణఁగి
చిత్ర మిది గొమ్మ వెలుగోటిచిన్నతిమ్మ.

232


సీ.

చెనసి యేదులఖాను సేనలఁ గొట్టవే
        వెనుక ముందయి గముల్ విచ్చి పాఱ
నొరసి కందనవోలి హొన్నప్పనాయని
        మర్దించవే విఱుపుమందు లిచ్చి

  1. A.B. పోరి
  2. A. గడుగవె. B. గడుపవె
  3. A.B. రొవ్వనిపక్క
  4. A.B. శకునబలందించి