పుట:వెలుగోటివారి వంశావళి.pdf/100

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

వెలుగోటివారి వంశావళి


వెలయువీణ పట్టి వేడ్కలు తెగ లొత్తు[1]
భూతకోటి పాడు[2] భూతయశుని
సింగభూపతనయు సంగరాభంగుని
యన్నపోతభూతలాధిపతిని.

96


క.

భూపతులు నీకు సరిగాఁ
జూపట్ట రమక్క తెనుఁగు సురథాని వహో
రూపజయంతత యమ లను[3]
శ్రీపతిసమ్మోద రావుసింగయమాదా.

97


క.

వింతే సింగయమాధవ
చింతింపక రాచకోట్ల శిరములఁ ద్రుంచన్[4]
ఎంతే కాలము జరిగిన
నంతెంబరగండబిరుదు నాహృతి గొనుటన్[5].

98


వ.

జల్లిపల్లికడ[6] రాజులఁ జంపి రణము గుడిపించి చలమర్తిగండ బిరుదును[7]
సోమకులపరశురామ బిరుదును[8], సింహతలాట బిరుదును[9] నంతెంబర
గండ, ధరణీవరాహ, చౌహత్తుమల్ల బిరుదులును[10] వహించి, భీమవరముకడఁ
గాపానేనిఁ జంపి[11], ఖడ్గనారాయణ, గాయగోవాళ, హిందూరాయసుర
త్రాణ బిరుదులును[12] వహించి, దన్నాలకోటకడ[13] రెండుమాఱులు రెడ్లవా
రిని గెలిచి జగనొబ్బగండ, సంగ్రామధనంజయ, రాజవేశ్యాభుజంగ బిరుదులు
దెచ్చినవారు రావు అనపోతానేఁడును[14], మాదానేఁడును[15], రాజుకొండ,

  1. A. B. జగకొత్తు
  2. A. B. నాని
  3. A. B. రూపజయంతంబమరెను
  4. A. B. ద్రుంచటు
  5. A. B. ఆహుతిగొంటివి
  6. A. B. కాడ
  7. B. A. న్ను
  8. B. A. న్ను
  9. B. A. న్ను
  10. B. A. న్ను
  11. A. B. భీమవరముకాడ కాపానేన్ని
  12. A. B. యిందూరాయ సురప్రాణబిరుదున్ను
  13. A. గాడ; B. కాడ
  14. A. B. న్ను
  15. A. B. న్ను