పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/97

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

95/695.


(బి) అంతరణ పథకములో పురస్కరించుకొని ఏదేని వివరణ యొక్క వ్యవహారము ప్రభావమైన యెడల, మూడవ పక్షకారులతో కలుపుకొని అందరు వ్యక్తులు, అట్టి వ్యక్తులు లేదా మూడవ పక్షకారులు దానికి అనుమతి ఇవ్వకపోయిన ప్పటికిని, అది బద్ధమై ఉండవలెను.

(4) ఉప-పరిచ్ఛేదము (2)లో నిర్దేశించిన రాజ్య ప్రసార వినియోగము లేదా ఉత్పాదక కంపెనీ లేదా ప్రసార లైసెన్సుదారు లేదా పంపిణీ లైసెన్సుదారు (ఇందు ఇటు పిమ్మట అంతరణ కర్తగా నిర్దేశించబడు) అయినట్టి ప్రభుత్వ కంపెనీ లేదా కంపెనీ లేదా కంపెనీలను సంప్రదించిన పిమ్మట ఏదేని ఇతర ఉత్పాదక కంపెనీ లేదా ప్రసార లైసెన్సుదారు లేదా పంపిణీ లైసెన్సుదారు ఈ పరిచ్ఛేదము క్రింద అంతరణకర్తలో నిహితమైన ఆస్తి, ఆస్తిలో హితము, హక్కులు మరియు దాయిత్వములను అంతరణ స్వీకర్తలో నిహితము చేయుటకుగాను అంతరణ పథకమును రూపొందించమనియు, మరియు అట్టి అంతరణ పథకమును. ఈ చట్టము క్రింద శాసనాత్మక అంతరణ పథకముగా ప్రచురించమనియు రాజ్యప్రభుత్వము అట్టి అంతరణ కర్తను కోరవచ్చును.

(5) ఈ పరిచ్ఛేదము క్రింద అంతరణ పధకము,

(ఎ) పరిణాము ప్రతిపత్తి యొక్క లాభదాయకత మరియు స్వయం భరణ శక్తిని పెంపొందించు, వితీయ సామర్థ్యమును చేకూర్చు, పోటీని ప్రోత్సహించు మరియు వినియోగదారుల హితములకు రక్షణ కల్పించు అనుబంధముల ఉమ్మడి రంగ కంపెనీల లేదా ఇతర విభజన పథకముల, విలీనీకరణ, సంవిలీనం, పునర్నిర్మాణం లేదా ఏర్పాట్ల స్థాపన కొరకు నిబంధించవచ్చును.

(బి) (i) వివాదాస్పద ఆస్తి, హక్కులు మరియు దాయిత్వములను నిర్దిష్ట పరచుట లేదా వివరించుట ద్వారా; లేదా

(ii) అంతరణ కర్త అధీనము యొక్క వివరణాత్మక భాగములో ఇమిడియున్న మొత్తం ఆస్తి, ఆస్తిలో హితం, హక్కులు మరియు దాయిత్వములను నిర్దేశించుట ద్వారా; లేదా

(iii) ఒకవైపు కొంతభాగం మరియు మరియొక వైపు కొంతభాగమును కేటాయించవలసియున్న ఆస్తి, ఆస్తిలో హితం, హక్కులు మరియు దాయిత్వములను నిర్వచించవచ్చును.