పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/91

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

... 89/689

భాగము - 12

దర్యాప్తు మరియు అమలు

126 (1) ఏదేని స్థలము లేక ప్రాంగణము తనిఖీ చేయునపుడు లేక తనిఖీ చేసిన పిన్ముట పరికరములు, గాడ్జెట్లు, యంత్రములు, డివైజులు (ఆకృతులు) కలిపినట్లు లేక తనిఖీ పిమ్మట ఎవ రేని వ్యక్తిచే రికార్డులు నిర్వహింపబడిన పిమ్మట వినియోగింపబడినట్లు కనుగొన బడినచో, నిర్ధారణ అధికారి, అట్టి వ్యక్తి విద్యుత్తు వినియోగమునకు అనధికారముగా పాల్పడినట్లు అభిప్రాయమునకు వచ్చినచో, అట్టి వ్యక్తి లేక అట్టి వినియోగము వలన లబ్ది పొందిన ఎవరేని ఇతర వ్యక్తి చెల్లించదగు విద్యుత్తు ఛార్జీలను, ఆతను తన యొక్క అభీష్టము మేరకు తాత్కాలికముగా నిర్ధారించవలెను.

2. తాత్కాలిక అంచనా ఉత్తర్వు విహితపరచబడునట్టి రీతిలో ఆ స్థలము లేక ప్రాంగణము యొక్క ఆక్రమణ లేక స్వాధీనము లేక ఇన్-ఛార్జీలోనున్న వ్యక్తిపై తామీలు చేయవలెను.

(3) ఉప-పరిచ్చేదము (2) క్రింద ఉత్తర్వు తామీలు చేయబడిన వ్యక్తి నిర్ధారణ అధికారి సమక్షమున తాత్కాలిక అంచనా పై ఏవేని అభ్యంతరములు ఉన్నచో, వాటిని దాఖలు చేయుటకు హక్కు కలిగియుండును అట్టి వ్యక్తికి ఆకర్ణింపబడుటకు తగిన అవకాశము నిచ్చిన మీదట చెల్లించదగు విద్యుచ్ఛక్తి ఛార్జీల యొక్క అట్టి తాత్కాలిక అంచనా ఉత్తర్వును లామీలు చేసిన తేదీ నుండి ముప్పది దినముల లోపల తుది అంచనా ఉత్తర్వును జారీ చేయవలెను.

(4) తాత్కాలిక అంచనా ఉత్తర్వును తామీలు చేయబడిన ఎవరేని వ్యక్తి అట్టి అంచనాను స్వీకరించవచ్చును మరియు అట్టి తాత్కాలిక అంచనా ఉత్తర్వును అతని పై తామీలు చేసిన ఏడు రోజుల లోపు లైసెన్సుదారుతో అంచనా మొత్తమును డిపాజిటు చేయవలెను.

(5) విద్యుచ్ఛక్తి అనధికారముగా ఉపయోగించబడుచున్నదని నిర్ధారణ అధికారి తుది నిర్ణయమునకు వచ్చినచో, ఆట్టి అనధికార విద్యుచ్ఛక్తి వినియోగము జరిగిన మొత్తము కాలావధికి నిర్ధారణ చేయవలెను, అయితే, అట్టి అనధికార విద్యుచ్ఛక్తి వినియోగము జరిగిన కాలావధిని పరిగణలోనికి తీసుకొనరాదు. అట్టి కాలావధిని తనిఖీ తేదీకి అవ్యవహిత పూర్వము పన్నెండు మాసముల కాలావధి వరకు పరిమితము చేయవలెను.

(6) ఈ పరిచ్ఛేదము క్రింద నిర్ధారణను ఉప-పరిచ్ఛేదము (5)లో నిర్దిష్టపరచిన సర్వీసుల యొక్క సంబంధిత వర్గములకు వర్తించు టారిఫ్ కు రెండు వంతులకు సమానమైన రేటులో ఉండవలెను.