పుట:విక్రమార్కచరిత్రము.pdf/9

ఈ పుట ఆమోదించబడ్డది

8

తమున సగము కాలము రాజ్యము నందును, గడమ సగము (సంవత్సరమునకు ఆఱు నెలల చొప్పున) లోకసంచారము చేయుచు అన్యత్రయుఁ గడపెను. పైనిఁ బేర్కొనిన హోరాశాస్త్రము సంస్కృతమునఁ గలదు. 'కలౌపారాశరీహోరా' యనుట నిది మిగులఁ బ్రామాణికము. జక్కన యిందలి శ్లోకము నుద్ధరించి ఫలితాంశమును జెప్పుటఁ జూడ నీ కవికి జ్యోతిశ్శాస్త్రమునందు మంచి పరిచయము గలదని తెలియును. ఇట్లే శరదృతువర్ణనము నందలి యీ క్రింది పద్యమును నీవిషయమునే నిరూపించెను.

“జలజచ్ఛత్రరుచిం బ్రకాశతరకాశశ్రేణికాచామరం
బులభద్రాసనకాంతి రాజ్యపద మొప్పుల్ మీఱఁ గుంభోద్భవుం
డెలమిన్ దక్షిణదిక్కునం దుదితుఁడయ్యెం, జంద్రతారాబలం
బుల మేలైనదినంబు లెవ్వరికి సమ్మోదంబు సంధింపవే!" (ఆ. 4-18)

యోగవిద్య

ఈక్రింది పద్యము కవికిఁ గల యోగవిద్యాపరిచితి నెఱిఁగింపఁగలది.

'బద్ధసిద్ధాసనపరిణతిఁ గూర్చిండి
                  హృదయసమాధాన మొదవఁ జేసి
మూలాలవాలసమున్నతి గైకొని
                  యనిలు మధ్యమనాడియందు నిలిపి
యంతర్గతము లైన యాఱుదామరలకు
                  నభినవోల్లాసంబు ననునయించి
యాంతరజ్వలనసంక్రాంతిచేఁ దొరఁగెడు
                  చంద్రకళాసుధాసారధారఁ
దడిసి, యాత్మాన్తుసంధానతన్మయత్వ
నిశ్చిలాంతరంగుండయి నిస్తరంగ
నీరనిధియునుబోలె నొప్పారుచున్న
మునివరేణ్యునిఁ బొడగంటి, మనుజనాథ.(ఆ. 2-218)

పంచమాశ్వాసము నందలి 127 నుండి 135 వఱకుఁ గల పద్యములలో కవికి గల అశ్వమేధయాగవిధానపరిజ్ఞానము నెఱంగించును.

సంస్కృతకవిత్వము

ఈ క్రింది శ్లోకములు జక్కన సంస్కృతపద్యరచనాశక్తినిఁ దెలుపును.

విరూపాక్షస్తుతి.