పుట:విక్రమార్కచరిత్రము.pdf/8

ఈ పుట ఆమోదించబడ్డది

7

జక్కనకవి సంస్కృతాంధ్రభాషలయందుఁ జక్కని వైదుష్యము గలవాడు. వ్యాకరణ సాహిత్యశాస్త్రపాండిత్యముతో పాటు, జ్యోతిశ్శాస్త్ర, యోగశాస్త్రముల యందును, యజ్ఞయాగాది వైదికకర్నిర్వహణవిధానము నందును మంచి పరిచయము సంపాదించినవాఁడు. సంస్కృతము నందును, గవిత్వము చేయుశక్తి గలవాఁ డని యితఁ డీ కావ్యమున రచించిన కొన్ని శ్లోకముల వలనఁ దెలియుచున్నది. ఇందుకుఁ గొన్ని యుదాహరణములు,

జ్యోతిశ్శాస్త్రము :- విక్రమార్కుఁడు జనించిన సందర్భమున నితఁడు వ్రాసిన పద్యములు.

“దిసకృద్వాసర చైత్రశుద్ధ నవమిం దిష్యం దృతీయాంశ స
జననంబొందెడు రాగమంజరికి రాజద్భాగ్యసౌభాగ్య మా
చనలగ్నంబునఁ బుత్రరత్నము, నిజోచ్చక్షేత్రసందీప్తులై
యినమందారసురాసురేజ్యబుధు లాయిందు న్విలోకింపఁగన్.

(ఆ. 1-174)

(ఇన, మంద, అర అని యిట పదవిభాగము; అనఁగా సూర్య, శని, అంగారకులు; తిష్యన్ అనఁగా పుష్యమి నక్షత్రము నందనుట.) రవ్యాది గ్రహము లాఱును తమ తమ ఉచ్ఛస్థానముల నుండి పుష్యమి నక్షత్రమునఁ దన స్వగృహము నందున్న చంద్రునిఁ జంద్రలగ్నమును వీక్షించుచుండగా శుభలగ్నమునందు విక్రమార్కుఁడు జన్మించినట్లు కవి వర్ణించెను. శ్రీరామచంద్రుఁడు నీ దినముననే జన్మించెను.

పై జన్మముహూర్తమునకు జ్యోతిష్కు లీక్రిందిఫలితమును జెప్పిరఁట.

శ్లో॥ కుముదగహనబంధౌ వీక్ష్యమాణే సమస్తై
     రగనగ గృహవాసైర్దీర్ఘజీవీసతుస్యాత్.
     యదసదశుభజన్యం యచ్చకీదృద్విమోదం
     సభవతి నరనాథస్సార్వభౌమో జితారిః." (ఆ. 1-78)

అని హోరాస్కంధబంధురంబైన యీ పద్యంబు నుపన్యసించి యిక్కుమారుండు దీర్ఘాయురుపేతుండును, జితారిసంఝాతుండును, జక్రవర్తిపదఖ్యాతుండును నగు నని విన్నవించిరఁట!

వీరు చెప్పినట్లే విక్రమార్కుఁడు చక్రవర్తి యయ్యెను. కాని శ్రీరాముఁడు జన్మించిన దినముననే జన్మించుటచేత నేమో, భట్టి సలహా ప్రకార మితఁడును జీవి