పుట:విక్రమార్కచరిత్రము.pdf/44

ఈ పుట ఆమోదించబడ్డది

43

ఇందుఁ జెప్పినట్లు శృంగారాది రసప్రసంగములుగా, సాంగోపాంగముఁగా, సువ్యక్తముగా నన్వయించునట్లు వాగ్విశేషరచనాచాతుర్య మేపారఁగాఁ గథలు చెప్పు నేర్పు జక్కన కవి కెక్కువ యనుట నిక్కువము. విక్రమార్కచరిత్రమను ప్రౌఢకథాకావ్యమును సలక్షణమును సాలంకారమును సరసవర్ణనాసహితమును సంస్కృతాంధ్రభాషాపాండిత్యస్ఫోరకమును నగు చక్కనిశైలితో సరసప్రబంధరచనకుఁ జక్కని రాజమార్గమును సంఘటించిన జక్కనకవి కీర్తికినిఁ గృతికిని మంగళమహశ్రీ.

ఉత్తమ కావ్యములలో నొక్కటి యైన విక్రమార్కచరిత్ర మిప్పుడు క్రయమునకు లభించుట లేదు. ప్రసిద్ధగ్రంథాలయముల యందు మాత్రమే దీనిప్రతు లొకటి రెండు దొరికిన దొరకును. పూర్వముద్రణముల వివరములు దిగువ నొసఁగఁ బడుచున్నది.

ప్రకటనకర్తలు; సంవత్సరము; పరిష్కర్తలు

1. ఆనందముద్రాక్షరశాలాధిపతులు, (చెన్నపురి) క్రీ.శ. 1896 శ్రీ కొమాండూరు అనంతాచార్యులు మఱియు శ్రీ రాయదుర్గము నరసయ్యగారు.

2. వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్సు. (మద్రాసు) 1913

3. వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్సు. (మద్రాసు) 1926 శ్రీ బులుసు సీతారామశాస్త్రిగారు.

పైవానిలో ఆనందముద్రాక్షరశాలాధికారులు ప్రకటించిన విక్రమార్కచరిత్ర ముదితప్రతి యందు ముద్రణదోషములును పరిష్కరణదోషములును కోకొల్లలు. దీనినిఁ బరిశీలించి అప్పుడు చెన్నపురి క్రిష్టియన్ కాలేజి సంస్కృతప్రధానపండితులుగా నుండిన శ్రీ వేదము వేంకటరామశాస్త్రులవారు “శారదాకాంచిక ప్రథమకింకిణి" అను విక్రమార్కచరిత్ర ముద్రణ విమర్శనమును వ్రాసిరి. ఇందు వారు గ్రంథము నందలి పరిష్కరణదోషములను శతాధికముగ నెత్తిచూపుచు వానికి సవరణలను గూడ తెలిపిరి. ఈ “విక్రమార్కచరిత్ర విమర్శనము" (60 అచ్చు పుటల వ్యాసము). అముద్రితగ్రంథచింతామణి యందుఁ దదనుబంధముగ క్రీ.శ. 1898 సంవత్సరములోఁ బ్రకటింపఁబడినది.

తరువాత శ్రీ శాస్త్రుల వారి 'విమర్శనము' ననుసరించి కొంత సంస్కరించి ఈ కావ్యమును క్రీ.శ. 1913లోఁ బ్రకటించిరి. కాని యిందును తప్పులు దొరలనిపుట లేదని చెప్పవచ్చును. మఱల క్రీ.శ. 1926 సంవత్సరములో నీ కావ్యమును