పుట:విక్రమార్కచరిత్రము.pdf/43

ఈ పుట ఆమోదించబడ్డది

42

నుండె ననుటకు శ్రీనాథకవి ద్విపద 'పల్నాటివీరచరిత్రము' వలన నూహింపవచ్చును. కావున నీ కవి తన కాలమునఁ గడు ప్రసిద్ధము లయిన నీ రెండువిషయముల నిం దేదోవిధమునఁ జేర్చి సూచింపయుండినోపు నని తోఁచును. - ?

జక్కన తన కావ్యమునందు భర్తృహరి రచించిన సంస్కృతగ్రంథముల నేకారణమునవో యిందుఁ బేర్కొనలేదు. కాని వరరుచి కృతులను నొకపద్యమునఁ ప్రత్యేకముగా నిట్లు పేర్కొనియున్నాఁడు.

వచియించెఁ బ్రాకృతవ్యాకరణాగమం
        బభినవంబుగ భోజవిభుఁడు మెచ్చ
సకలవర్ణాశ్రమాచార నిర్ణయమొప్ప
        ధర్మశాస్త్ర మొనర్చెఁ దజ్ఞు లలర
ధీయుక్తి మెరయ జ్యోతిశ్శాస్త్ర మొనరించె
        సకలలోకోపకారకము గాఁగఁ
గాళిదాసుని నవ్యకావ్యవిద్యాప్రౌఢి
        వరకవీశ్వర చక్రవర్తిఁ జేసె
భవ్యనారాయణీయ ప్రపంచసార
శారదాతిలగారి ప్రశస్తమంత్ర
శాస్త్రసర్వంకషజ్ఞానసరణి మించె
శీలవతిపట్టి సర్వజ్ఞశేఖరుండు.(ఆ. 1-188)

'సంస్కృత కవి జీవితము' (మల్లాదివారు) నందు భర్తృహరి విషయము కలదు గాని అందు 'వరరుచి' ప్రసక్తి కానరాదు. భోజుఁడును గాళిదాసును సమకాలీనులే కాక వరరుచియ వారికాలమువాఁడే యయినట్లు పై పద్యము వలన తోచును. ఇందు జక్కన తెలిపిన గ్రంథములు వరరుచి కృతములు ప్రాకృతగ్రంథము లగుట మల్లాదివారు వీనిని గూర్చి తెలిపియుండరు. ఈ కవి కృత్యాది సంస్కృత (ప్రాకృత) కవిస్తుతిలోఁ గూడ వరరుచి, శాతవాహనులను బ్రశంసించెను.

ఇందలి తుది యాశ్వాసము నందు విక్రమార్కునిచేఁ బ్రాణముపోయఁబడిన 'సువర్ణ కలశము' తన కథాకథన దక్షత నిట్లు తెలిపెను.

శృంగారాదిరసప్రసంగములుగాఁ జెప్పంగ నేర్తుం గథల్
సాంగోపాంగముగాఁగ, నొక్క కథ సువ్యక్తంబుగా నవ్వయిం
పంగాఁ జెప్పెదఁ జిత్తగింపుమని చెప్పం జొచ్చె భూపాలుతో
సంగోత్పాదక వాగ్విశేషరచనా సామర్థ్య మేపారఁగన్.(ఆ. 8.4)