పుట:విక్రమార్కచరిత్రము.pdf/42

ఈ పుట ఆమోదించబడ్డది

41

ముగురం గూర్చిన ముండదైవము
బిగిచన్నుల నడిమి మణులపేరుం బోలెన్
మరువము మొలవఁగఁ దోడనె వరిమళ ముదయించినట్లు
పచ్చపయికంబు లేకుండ వెచ్చపఱచి

పలుకుఁబడులు : పూసగ్రుచ్చినగతి; కరతలామలకముగా , ఆమూలచూడముగ; పల్లవిపాటగా; తలపూ వాడకయుండఁగ; చెక్కడచిన వసరాలెడు; మొలపూసలు ద్రెవ్విననాఁటనుండియున్; పులు గడిగిన ముత్యముసిరి; దేవియుం దేవరయుఁబోలె; తాళమువైచినగతి; సెలవిపాఱఁగనవ్వుచు; పులకండపుఁబొమ్మ; నివాళి సేయునగవులు; ముంగిలెఱుంగని ముద్దరాలు-; పగలుచాటు; కాలుద్రవ్వు; వక్కరించు; మగమాటలాడు; బొమ్మవెట్టు: తూ పొడుచు; కొల్లకోటుసేయు; త్రోద్రోపులాడు; తూఱుదుంకెనలాడు; చాటున కెక్కు; కర్ణపారణ మొనరించు; గిరవులుపుత్తెంచు; ఇల్లడపెట్టు; వారకంబిచ్చు; పులుకడుగు; కనుఁబాటు దాఁకు; కరసానఁ బట్టించు; కార్యఖడ్గములు – ఇట్టి వడుగడుగున దడఁబడుచుండును.

కొన్ని ప్రత్యేక పదములు : పొతముగ; వాలాయించి; ఒడమి; విల్వకాఱు; ఉత్తులు; ఆందోళము నొందు; నేలమాలె; పుడుకు వేదుఱు; కొలువుసాల; తెరవాఱు; రిత్తకురిత్; సునాయాసముగా; నీరామని; అణకలు వైచుకొను; కవలుపోవు; గాదము; కంచులి; రజ్జులాట; మొక్కలంబుగ; పుతపుతవోవు; ఖధునీ; నమ్మునం గలియు; పిల్లుగట్టు; తొడుకొనివచ్చు; పక్కెర; పౌజు; మజా; బైసుక పెట్టు; ఇసిరింతలువాఱు; కొలుకాఁడు; ఈలవెట్టు; బళాయివెట్టు; డాగు; జరి; కుంటెనీలు; కోడిగీలు: జుమ్మికాండ్రు; ఇచ్చగొండులు: ఉచ్చమల్లులు; (బంగారు) సకినలు; (అంగన) నడపు; గిరవుపట్టు; గిఠవు పట్టు; బాగాలు —మున్నగు దేశ్య, అన్యదేశ్యపదజాలము నీ కవి యిందు విశేషముగఁ బ్రయోగించియున్నాఁడు.

విక్రమార్కుఁ డుజ్జయిని యందలి కాళికామందిరమునఁ బ్రవేశించిన సందర్భమున నందలి వివిధవిచిత్రవిషయములను వర్ణించుచు ద్వితీయాశ్వాసమున నొక దీర్ఘవచనమును [51] రచించెను. అందలి మణిమండపములు “ప్రసిద్ధసిద్ధజనకథితనవనాథచిత్రచరిత్రవర్ణనప్రమోదహృదయసామాజికవిరాజమాన"ము లయినట్లును; మఱియు నందొక చోట “నిరవధికభక్తిరసాతిశయప్రాణాపహారసమర్పణమహావీరశిలాప్రతిరూపంబు"లు నుండినట్లును జక్కన కవి వర్ణించెను. జక్కన కాలమునందు "నవనాథసిద్ధుల' కథలు ప్రచారమున నుండె ననుట కీ కాలముననే గౌరనకవి రచించిన ద్విపద 'నవనాథచరిత్ర' కావ్యమే తార్కాణము. ఇట్లే. పలనాటి మహావీరుల కథలును బ్రచారమున