పుట:విక్రమార్కచరిత్రము.pdf/330

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

విక్రమార్కచరిత్రము


[1]న్న రమానందనుఁడైన సిగ్గువడఁడే నాపాలిభాగ్యంబుగా
నరు దేఁబోలుఁ దలంప నీతఁ డనుచుం హర్షించె నక్కాంతయున్.

86


క.

అంతట నిద్దఱ మనసులుఁ
గంతునిపస గలసె, వింతకసమస లొలయన్
మంతనములు పెదవుల నిసి
ఱింతలు వాఱంగ, నగవు ఱెప్పలు గోరన్.

87


వ.

తదనంతరం బాపుష్పకరండకుండు.

88


క.

తా వచ్చినకార్యమును, గు
ణావతి పుత్తెంచినట్టి నైపుణమును లీ
లావతికిఁ జెప్ప నదియును
భావంబున సంతసంబు బైసుకవెట్టన్.

89


ఉ.

ఆసమయంబునం దపనుఁ డస్తగిరీంద్రమునందుఁ బొంద, లీ
లాసరసానుకూలగతులం దగ వానికి నాఁడురూప మె
చ్చై సొబగారుచుండ, మణిహారవిభూషణ రాజిచేతఁ గై
సేసిన, నొప్పెఁ గృత్రిమపుఁజేడియయైన ముకుందుఁడో యనన్.

90


ఉ.

అప్పుడు నాథుఁ డింటికి రయంబున వచ్చిన మ్రొక్కఁబంచినం
దప్పక చూచి చీఁకటికతంబున నాఁటదిగాఁ దలంచి, యీ
యొప్పులకుప్ప యెవ్వ, రని యువ్విళులూరుచు వేఁడఁజొచ్చినం
జెప్పఁదొణంగెఁ దొయ్యలి వశీకృతదుశ్చరితప్రవీణ యై.

91


క.

ఈయంగన పద్మావతి
మాయక్క, ననుం దలంచి మన సూఱటగా
నీయెడకు వచ్చె ననుచును
మాయోపాయంబుగాఁగ మగనికిఁ జెప్పెన్.

92
  1. న్న రమానందనుఁ డైనఁ జిక్కువడఁడే; నాపాలిభాగ్యంబు దా
    నరు దేఁబోలుఁ దలంప నీతఁ డనియన్ హర్షించె నక్కాంతయున్.