పుట:విక్రమార్కచరిత్రము.pdf/33

ఈ పుట ఆమోదించబడ్డది

32

మెఱుగారు ముత్తెములచే
మెఱవడి యగు నల్లపట్టు మేల్కట్టు గతిన్.(ఆ. 6-64)

సూర్యతాపవర్ణనము :

[1]కల్పాంతదుర్దాంతకలుషాంతకస్వాంత
        దుర్వారవహ్నికి నోర్వవచ్చు
నిష్ఠురనిర్దోషనిర్ఘాతసంఘాత
        జాతమహావహ్ని సైఁపవచ్చుఁ
బ్రళయకాలాభీలఫాలలోచనఫాల
        భాగానలస్ఫూర్తి బ్రతుకవచ్చుఁ
గాకోదరేంద్రఫూత్కారసంభవతీవ్ర
        కాకోలదహనంబుఁ గదియవచ్చుఁ
గాక సైరింపవచ్చునే లోకదహన
దర్శితంబైన యస్మత్ప్రతాపవహ్నిఁ
దావకోత్సాహ సాహసౌదార్య దైర్య
గతికి మెచ్చితి విక్రమార్క క్షితీంద్ర!(ఆ. 2-112)

సూర్యాస్తమయ వర్ణన :

పశ్చిమాంభోనిధిప్రాంతదేశంబున
        రంజిల్లు విద్రుమకుంజ మనఁగఁ
జరమాద్రిశిఖరదేశంబునఁ గనుపట్టు
        కమనీయఘనరత్నగండ మనఁగ
నపరదిక్కామిని యమరంగఁ గనుఁగొను
        పద్మరాగంపుదర్పణ మనంగ
పశ్చిమదిక్కుంభిఫాలభాగంబున
        బొలుపొందు జేగురుబొట్టనంగఁ
బూర్వకంధి వేలావనభూమిఁ బండి
కాలశుకతుండహృతి బిట్టుగదలి, యపర
జలధిలోఁ బడు దాడిమీఫల మనంగ
నబ్జినీవనబాంధవుఁ డస్తమించె.(ఆ. 3-85)

తపసివర్ణన :

అచ్చవెన్నెలమించు నపహసించు విభూతి
        యంగరాగంబుగా నలవరించి

  1. పిల్లలమఱ్ఱి, భట్టుమూర్తి, అయ్యలరాజు మున్నగువారిలో నీ శైలియు, పదగుంఫనమును గోచరించును.